ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతోంది. మెగా వేలంలో 577 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరగనుంది. అయితే, గరిష్టంగా 204 మంది ఆటగాళ్లను మాత్రమే విక్రయిస్తారు. ఐపీఎల్లో ఇది 18వ వేలం కావడం విశేషం.
సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రో నడపడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఎంపికైంది. అవును, లోకో పైలట్‌గా పనిచేస్తున్న ఈ మహిళ ఇప్పుడు సుదూర సౌదీ అరేబియాలో మెట్రో రైలు నడపబోతోంది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
సౌదీలోని అల్-జౌఫ్ ప్రావిన్స్ సమీపంలో కనుచూపు మేర మంచు దుప్పటి కప్పేసింది. భారీగా మంచు కురుస్తుంది. ఎడారి రోడ్లపై మంచును చూసి స్థానికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
సుమారు ఓ 50 ఏళ్లకు దగ్గరలో వయసున్న వ్యక్తి.. పైగా వికలాంగుడు.. రెండేళ్లుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో చిక్కుకుపోయాడు. దిక్కూ మొక్కు లేక దేశం కాని దేశంలో ఇరుక్కుపోయి ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. దయనీయమైన అతని కన్నీటి గాథకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి చెందిన సయ్యద్ హాజీ స్వతహాగా వికలాంగుడు. ఉమ్రా , హజ్ తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తామంటే గుడ్డిగా నమ్మేశాడు. కానీ అతనికి అలా చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ల…
హిజ్బుల్లా, ఇరాన్‌తో విభేదాల మధ్య అరబ్ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలాయి. టెహ్రాన్, ఇజ్రాయెల్ మధ్య వివాదంలో తాము తటస్థంగా ఉంటామని ఇరాన్‌కు భరోసా ఇవ్వడానికి అరబ్ దేశాలు ఈ వారం దోహాలో సమావేశమయ్యాయి. ఈ ప్రాంతంలో వివాదాలు పెరగడం వల్ల తమ చమురు కేంద్రాలకు ముప్పు వాటిల్లుతుందని అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్థానీ యాచకుల సంఖ్య పెరుగుతుండడం పట్ల సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేసింది. యాచకులను గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌కి సూచించింది.
Rub al Khali Desert: తెలంగాణకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి సౌదీ అరేబియాలో అత్యంత దారుణ పరిస్థితుల్లో మరణించాడు. రబ్ అల్ ఖలీ ఎడాదిలో దిక్కుతోచని స్థితిలో జనావాసాలకు వెళ్లే మార్గం లేకపోవడంతో అధిక అలసట, డీహైడ్రేషన్‌తో విషాదకరమైన స్థితిలో మరణించాడు. సౌదీలోని అల్ హసా ప్రాంతంలో టెలికాం కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తున్న మహ్మద్ షెహజాద్ ఇటీవల తన సహచరుడితో కలిసి ఎడారి ప్రాంతానికి వెళ్లాడు.
Saudi Arabia: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్)పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులపై సౌదీ యుద్ధాన్ని ప్రారంభించేందుకు ఎంబీఎస్ తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు సౌదీకి చెందిన మాజీ అధికారి ఒక నివేదికలో ఆరోపించారు.