Trap : సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన హైదరాబాదీ.. సాయం కోసం ఎదురుచూపులు
- సుమారు ఓ 50 ఏళ్లకు దగ్గరలో వయసున్న వ్యక్తి
- ఉచితంగా ఉమ్రా పేరుతో సౌదీ అరేబియాకు తరలింపు
- తిరిగి ఇండియా తీసుకురావాలని బాధితుడు వేడుకోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమారు ఓ 50 ఏళ్లకు దగ్గరలో వయసున్న వ్యక్తి.. పైగా వికలాంగుడు.. రెండేళ్లుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో చిక్కుకుపోయాడు. దిక్కూ మొక్కు లేక దేశం కాని దేశంలో ఇరుక్కుపోయి ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. దయనీయమైన అతని కన్నీటి గాథకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి చెందిన సయ్యద్ హాజీ స్వతహాగా వికలాంగుడు. ఉమ్రా , హజ్ తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తామంటే గుడ్డిగా నమ్మేశాడు. కానీ అతనికి అలా చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ల ద్వారా మోసపోయాడు. ఉమ్రా అంటే ఓ ఏడాది కాలంలో ముస్లింలు ఎప్పుడైనా మక్కా తీర్థయాత్ర చేస్తే దానిని ఉమ్రా అంటారు. అయితే.. అతనిని ఉచితంగా ఉమ్రా తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తానని, తిరిగి మళ్లీ తీసుకువస్తామని ఏజెంట్లు వాగ్దానం చేసినట్లు వికలాంగుడైన సయ్యద్ హాజీ ఆరోపిస్తున్నాడు. ఉమ్రా పూర్తయిన తర్వాత వారు అతడిని సౌదీ అరేబియాలోని రియాద్‌కు తీసుకెళ్లి పని చేయమన్నారని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఒక హోటల్‌లో పని కోసం ఉన్నప్పటికీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా చేయలేనని నిర్ణయించుకుని తిరిగి ఇండియా రావాలని భావించాడు.
Krishna District: చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఐదుగురు క్షేమం.. ఇద్దరు మృతి
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
కానీ, ఉమ్రాకు తీసుకెళ్తామని మాట ఇచ్చిన ఆ ఏజెంట్లు అతన్ని సౌదీ అరేబియాలోని రియాద్‌లోనే విడిచిపెట్టారు. గత రెండేళ్లుగా చేసేది లేక సయ్యద్ హాజీ ఫుట్‌పాత్‌లపైనే జీవనం సాగిస్తున్నాడు. ఆ దారిలో వచ్చిపోయే వారు ఇచ్చే ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నాడు. తన పరిస్థితి ఇక్కడ అయోమయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఎలాగైనా తమ గోడు తెలుపుకోవాలని, సయ్యద్ హాజీని తిరిగి తెచ్చుకోవాలని అతని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖ రాశారు. సయ్యద్ హాజీ నంబర్ 0505260733 లేదా ఇండియా వాట్సప్ నంబర్ 8341544010కి కాల్ చేసి వీలైనంత త్వరగా తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నారు.
Krishna District: చెరువులో ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ఐదుగురు క్షేమం.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!