సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఒకప్పుడు శత్రు దేశంగా ఉన్న సిరియాతో తన సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నట్లు ప్రకటించారు. 12 ఏళ్లుగా సిరియాతో సంబంధాలను నిలిపివేసిన సౌదీ అరేబియా సిరియా రాజధాని డమాస్కస్‌లో తన రాయబారిని నియమిస్తున్నట్లు ఆదివారం వార్తలు వచ్చాయి.
హైవేలపై వెళ్తుంటే మలుపులు వచ్చిన దగ్గరి కాస్త స్లో చేసుకుని వెళ్తాం. అలాంటప్పుడు కాస్త చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే.. మంచి స్పీడ్ లో వచ్చి, మళ్లీ స్లో అయితే గేర్లు మార్చాలి.. మళ్లీ పికప్ అందుకోవడానికి సమయం పడుతుంది. అందుకే డ్రైవింగ్ చేసే వాళ్లు చిరాకెత్తిపోతారు. అదే.. చక్కటి రోడ్డు ఉంటే, హ్యాపీగా బ్రేక్ మీద కాలుపెట్టకుండా, గేర్లు మార్చకుండా వెళ్లొచ్చు. అయితే.. మలుపులు లేని రోడ్లు ఎక్కడో చోట కొంత దూరం ఉంటాయి, కానీ.. సౌధీ…
Saudi Arab : రియాద్ ప్రాంతంలోని హురేమిలా గవర్నరేట్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఉత్పత్తుల ఎక్స్ పైరీ డేట్లను మారుస్తున్న అక్రమ కార్మికులను సౌదీ వాణిజ్య మంత్రిత్వ శాఖ పట్టుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ గురువారం నివేదించింది.
Saudi Arab : సౌదీ అరేబియాలో గత 24 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షాలు దేశవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్నాయి. కొంతకాలం క్రితం దుబాయ్‌లో ఇలాంటి దృశ్యమే కనిపించింది.
సౌదీ జైల్లో ఉన్న కేరళ వ్యక్తి కోసం కేరళీయులు పెద్ద మనసు చాటుకున్నారు. అతన్ని విడిపించుకునేందుకు ఏకంగా రూ.34 కోట్లు సమకూర్చారు. కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీలో బాలుడికి సంరక్షకుడిగా ఉండేవాడు.
పాకిస్థాన్ ప్రధానమంత్రిగా కొత్తగా ఎన్నికైన షాబాజ్ షరీఫ్.. తన మొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు. నవాజ్, ఇమ్రాన్‌ల బాటలోనే తొలి విదేశీ పర్యటనకు సౌదీ అరేబియాను ఎంచుకున్నాడు. అయితే.. కశ్మీర్ సమస్యకు సంబంధించి సౌదీ అరేబియా షాబాజ్‌కి భారీ షాకిచ్చింది. కశ్మీర్ అంశం భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సమస్య అని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. న్యూఢిల్లీతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ పాకిస్థాన్ ప్రధానికి సూచించారు.
Saudi Arabia: సంప్రదాయ ఇస్లామిక్ దేశంగా పేరున్న ‘సౌదీ అరేబియా’ తన ఛాందసవాదాన్ని నెమ్మదిగా వదులుకుంటోంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నెమ్మదిగా ఆ దేశంలో మార్పులు వస్తున్నాయి. గతంలో మహిళా హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేని ఆ దేశంలో ఇప్పుడు ఏకంగా ఓ మహిళ దేశం తరుపున ‘‘మిస్ యూనివర్స్’’ పోటీల్లో పాల్గొనబోతోంది.
భారత్, సౌదీ అరేబియాల సంయుక్త సైనిక విన్యాసాలు రాజస్థాన్‌లో సోమవారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య సైనిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి తమ తొలి సంయుక్త విన్యాసాలను ప్రారంభించినట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది.