ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు పోయిన తర్వాత, పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు, పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి జరిగనప్పటి నుంచి పాకిస్తాన్ భయంతో వణుకుతోంది. బయటికి మాత్రం ఆ దేశ రాజకీయ నేతలు పెద్దపెద్ద స్టేట్‌మెంట్లు ఇస్తూ, అక్కడి ప్రజల్ని నమ్మిస్తున్నారు తప్పితే, లోలోపల మాత్రం భారత్ ఏం…
Viral Video: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం సౌదీ అరేబియా పర్యటన కోసం బయలుదేరారు. రెండు రోజులు పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య మరింతగా సంబంధాలు బలపడేలా, పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, సౌదీ ప్రభుత్వం ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం పలికింది.
ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు వెళ్లారు. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ సౌదీకి వెళ్తున్నారు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఏప్రిల్ 22, 23 తేదీల్లో మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్నట్లు పేర్కొంది.
Saudi Arabia: హజ్ భద్రతా సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ అరేబియా 14 దేశాలపై వీసా బ్యాన్ విధించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది హజ్ తీర్థయాత్ర ముగిసే జూన్ మధ్య వరకు ఈ నిషేధం ఉంటుంది. వీసా సస్పెన్షన్‌లో ఉమ్రా వీసాలతో పాటు వ్యాపార మరియు కుటుంబ సందర్శన వీసాలు కూడా ఉన్నాయి. సరైన రిజస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్రకు వచ్చే వారిని నియంత్రించేందుకు సౌదీ అరేబియా ఈ దేశాలకు…
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఐఎస్ఐ చీఫ్ అసిమ్ మాలిక్, విదేశాంగ కార్యదర్శి అమ్నా బలోచ్ ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించారు. సౌదీ, యూఎస్ అధికారులతో పాక్ అధికారులు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ట్రైన్ హైజాక్ ఘటన, ఇతర దాడుల తర్వాత వీరంతా సౌదీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో పాకిస్తాన్‌ని సౌదీ అరేబియా,…
సినిమా హాలులో పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్ తాగడం అందరికీ ఇష్టం. కానీ లోపల వాటి ధరలు మాత్రం మామూలుగా ఉండవు. బయటి ఫుడ్‌ని కూడా థియోటర్లోకి తీసుకెళ్ల నివ్వరు. దీని కారణంగా చాలా సార్లు జనాలు రహస్యంగా బయటి ఫుడ్ తీసుకువస్తారు. కానీ సౌదీ అరేబియాలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సినిమా థియేటర్లోకి పెద్ద డ్రమ్ములు, బకెట్లతో వస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడేళ్ల క్రితం మొదలైన యుద్ధానికి ముగింపు పడే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలతో ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు శ్రీకారం చుట్టారు.
Haj yatra: ముస్లింలకు ఎంతో పవిత్రమైన ‘‘హజ్ యాత్ర’’కు సంబంధించి భారత్-సౌదీ అరేబియాల మధ్య ‘‘హజ్ ఒప్పందం’’ కుదిరింది. రెండు దేశాల మధ్య ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్వాగతించారు. ఈ ఒప్పందం ఖరారైన తర్వాత భారతదేశంతో ‘‘పవిత్ర భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం గౌరవంగా భావిస్తున్నాను” అని సౌదీ అరేబియా గురువారం తెలిపింది.