సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అందరూ హైదరాబాద్ వాసులే అని తెలంగాణ హజ్ కమిటీ ప్రకటించింది. చనిపోయిన వారిలో విశ్రాంత రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబం మొత్తం ఉంది. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన నజీరుద్దీన్ తన 18 మంది కుటుంబ సభ్యులతో కలిసి మక్కా యాత్రకు వెళ్లగా.. అంతలోనే ఘోర ప్రమాదం ఆయన కుటుంబాన్ని కబళించింది. ఈ 18 మంది అంత్యక్రియలు మక్కాలోని మదీనాలోనే…
Pakistan: ఇటీవల ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి ఇరు దేశాలు కూడా పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. అయితే, ఈ వివాదాలు తగ్గేలా టర్కీ వేదికగా రెండు దేశాలు శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Saudi viral Video: పృథ్వీ రాజ్ నటించిన ‘‘గోట్ లైఫ్’’ సినిమా గుర్తుందా.?, ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన హీరో అక్కడి ఎడారిలో తన యజమాని చేతిలో చిక్కుకుపోయి, ఒంటలు కాస్తూ దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ, అక్కడ నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నిస్తుంటాడు. సరిగ్గా ఇలాంటి సంఘటనే రియల్ లైఫ్‌లో జరిగింది.
Pakistan: పాకిస్తాన్లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల చీఫ్‌గా, సీఐఏ అధికారిగా 15 ఏళ్ల పనిచేసిన జాన్ కిరియాకౌ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మిలియన్ల కొద్ది అమెరికా సాయం తీసుకున్న విషయాన్ని వెల్లడించారు. ఆయన హయాంలోనే పాకిస్తాన్ అణ్వాయుధాలను అమెరికా నియంత్రించిందని పేర్కొన్నారు. ముషారఫ్ అణు నియంత్రణను అమెరికాకు అమ్మేశాడని ఆయన అన్నారు.
Pakistan: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు దేశాల సరిహద్దు వెంబడి తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయి. మంగళవారం పాక్ దళాలు, ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో 15 మంది సాధారణ పౌరులు చనిపోయినట్లు ఆఫ్ఘాన్ తాలిబాన్ అధికారులు చెప్పారు.
Pakistan: పాకిస్తాన్ చాలా డేంజరెస్ గేమ్ ఆడుతోంది. ఇస్లామిక్, అరబ్ దేశాల్లో ఉన్న భయాలను పాకిస్తాన్ క్యాష్ చేసుకుంటోంది. ఇస్లామిక్ ప్రపంచంలో కేవలం పాక్ వద్ద మాత్రమే అణు బాంబు ఉంది. ఈ బలంతో తాము ఇతర ఇస్లామిక్ దేశాలను రక్షిస్తామనే భ్రమను కల్పిస్తోంది.
భారతదేశంతో యుద్ధం జరిగితే సౌదీ అరేబియా ఇస్లామాబాద్‌ను కాపాడుతుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. జియో టీవీతో మాట్లాడుతుండగా భారత్‌తో యుద్ధం జరిగితే సౌదీ సపోర్టుగా వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు కచ్చితంగా వస్తుంది... అందులో ఎలాంటి సందేహం లేదని బదులిచ్చారు.
పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే రెండు దేశాలపై దాడి చేసినట్లుగా భావించాలనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. అప్పుడు రెండు దేశాలు కలిసి శుత్రువుపై దాడికి దిగాలని ఒప్పందం సంతకాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంపై అధ్యయనం చేస్తున్నట్లుగా ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
Pakistan-Saudi Pact: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది అని అనుకోండి, పాకిస్తాన్ దారుణంగా దెబ్బతిన్నది ఊహించుకోండి, ఆ సమయంలో భారత్‌పై యుద్ధానికి సౌదీ అరేబియా వస్తుందా..? ఇప్పుడు ఇదే పెద్ద ప్రశ్నగా ఉంది. తాజాగా, పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఒక రక్షణ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం, రెండు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా, అది రెండో దేశంపై దాడిగా పరిగణించబడుతుందనేది ఒప్పందం సారాంశం. అయితే, నిజంగా భారత్‌కు వ్యతిరేకంగా సౌదీ రాయల్ ఆర్మీ…
Death Penalty: సౌదీ అరేబియాలో గత కొద్దీ కాలంగా కాలక్రమేణా కొత్త ముప్పు వేగంగా పెరుగుతోంది. అదే ‘క్యాప్టగాన్’ (Captagon) ముప్పు. క్యాప్టగాన్ అనేది ఒక డ్రగ్. 2025లో ఇప్పటివరకు సౌదీలో 217 మందికి ఉరిశిక్ష అమలు చేయగా.. అందులో 144 మందికి ఈ మందు వల్లే ఉరిశిక్ష పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. క్యాప్టగాన్ అనేది ఒక ఎమ్ఫెటమిన్ తరహా మత్తు మందు. దీన్ని “పేదల కోకైన్” అని కూడా పిలుస్తారు. ఇది…