Millionaires migration: ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుంచి మిలియనీర్లు వలస వెళ్తున్నారు. పెట్టుబడి ద్వారా నివాసం, పౌరసత్వం వంటి అంశాలను అధ్యయనం చేసే ప్రపంచ కన్సల్టెన్సీ దిగ్గజం హెన్లీ అండ్ పార్టనర్స్ నివేదిక ప్రకారం.. 2025లో 1,42,000 మంది మిలియనీర్లు కొత్త దేశానికి వలస వెళ్లే అవకాశం ఉందని చెప్పింది.
Hajj Yatra: హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న మస్జిద్ అల్-హరామ్ (పవిత్ర మసీదు) ప్రాంతంలో జరగుతుంది. హజ్ యాత్ర ఇస్లాం మతంలోని కీలక అంశం. అంటే ఒక ముస్లిం ఆర్థికంగా, శారీరకంగా స్తోమత ఉన్నంతలో తన జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర చేయాలి. ఇక హజ్ ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్లోని 12వ నెల ధుల్ హిజ్జా లో నిర్వహించబడుతుంది. ధుల్ హిజ్జా 8వ…
PAK Beggars: తాము ఏ మిత్రదేశానికి వెళ్లినా.. అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తున్నారని.. మూడేళ్ల క్రితం ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించాడు. ఆయన అప్పుడు ఏ ఉద్దేశంతో అన్నారో గానీ.. దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్లు భయ పెడుతున్నారు.
నాన్నా.. నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకు రానివ్వడం లేదు.. నన్ను తిరిగి భారత్కు తీసుకువెళ్లు నాన్న అంటూ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు ఫోన్లో తండ్రికి తన గోడును వెలిబుచ్చాడు.. బాధితుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేషా, బీబీల కుమారుడు నజీర్బాషా డిసెంబర్లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. ట్రంప్నకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు.
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం.. పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మే 9 (శుక్రవారం) రాత్రి కూడా పాకిస్థాన్ భారతదేశంలోని అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ ఈ దాడులను విజయవంతంగా తిప్పికొట్టింది. భారత సైన్యం ప్రతీకార చర్యలో భాగంగా పాకిస్థాన్ సైన్యానికి చెందిన అనేక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు పోయిన తర్వాత, పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు, పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి జరిగనప్పటి నుంచి పాకిస్తాన్ భయంతో వణుకుతోంది. బయటికి మాత్రం ఆ దేశ రాజకీయ నేతలు పెద్దపెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ, అక్కడి ప్రజల్ని నమ్మిస్తున్నారు తప్పితే, లోలోపల మాత్రం భారత్ ఏం…
Viral Video: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం సౌదీ అరేబియా పర్యటన కోసం బయలుదేరారు. రెండు రోజులు పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య మరింతగా సంబంధాలు బలపడేలా, పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే, సౌదీ ప్రభుత్వం ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం పలికింది.
ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి జెడ్డాకు వెళ్లారు. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ సౌదీకి వెళ్తున్నారు.
ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఏప్రిల్ 22, 23 తేదీల్లో మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్నట్లు పేర్కొంది.