కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు రియాద్ పర్యటనకు బయలు దేరారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో రేపటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న ‘ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’లో పాల్గొననున్నారు. ‘టువర్డ్స్ గ్రాండ్ అగ్రిమెంట్’ థీమ్‌తో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ఖనిజ వనరుల అభివృద్ధి అంశంపై విస్తృతమైన చర్చ జరుగుతుంది.
READ MORE: Nitish Kumar Reddy: మోకాళ్లపై తిరుమల కొండకు నితీశ్‌కుమార్ రెడ్డి..
అనంతరం వివిధ దేశాల గనుల శాఖ మంత్రులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్ లో కేంద్రమంత్రులు, కంపెనీల సీఈవోలు ఈ కాన్ఫరెన్స్ లో ప్రసంగించనున్నారు. ఖనిజ సంపదపై ఫలప్రదమైన చర్చ జరగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖనిజ సంపద సద్వినియోగం అవ్వాలన్న లక్ష్యంతో సౌదీ అరేబియా ప్రభుత్వం రియాద్ వేదికగా మూడేళ్లుగా ఈ సదస్సును నిర్వహిస్తోంది.
READ MORE: Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన హరీష్ రావు, కేటీఆర్