Sanju Samson Fined Rs 12 Lakh Due To Slow Over Rate in RR vs GT Match: ఐపీఎల్ 2024లో రాజస్తాన్ రాయల్స్ తొలి ఓటమి చవిచూసింది. రాజస్తాన్ వరుస విజయాలకు గుజరాత్ టైటాన్స్ అడ్డుకట్ట వేసింది. సంజూ సేనను వారి తమ సొంత మైదానంలో చివరి బంతికి ఓడించి.. ఊహించని విజయాన్ని గుజరాత్ అందుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓటమి ఖాయమనుకున్న…
Sanju Samson on Rajasthan Royals Defeat vs Gujarat Titans: కెప్టెన్స్ కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే.. ఓటమి తర్వాత అందుకు గల కారణాలు చెప్పడమే అని రాజస్థాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ పేర్కొన్నాడు. గుజరాత్ టైటాన్స్‌పై చివరి బంతి కారణంగానే ఓటమిపాలయ్యాం అని నవ్వుతూ తెలిపాడు. ఈ ఓటమి నుంచి తాము గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతాం అని సంజూ చెప్పాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం టైటాన్స్‌తో జరిగిన…
IPL 2024లో ఓటమి ఎరగని రాజస్థాన్ రాయల్స్, జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఐదు మ్యాచ్ ల్లో మూడు ఓటములతో పోరాడుతున్న టైటాన్స్, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని విజయం కోసం పోరాడుతుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని కోల్పోయిన టైటాన్స్, గిల్ ప్రదర్శనపై ఆధారపడింది. ఇక ఈ మ్యాచ్ లో వారు బ్యాటింగ్ అసమానతలను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా గిల్ యొక్క ఓపెనింగ్ భాగస్వామి బి సాయి సుదర్శన్, అఫ్ఘాన్ త్రయం…
మర్చి 28, 2024 గురువారం జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 2024 తొమ్మిదో మ్యాచ్ లో భాగంగా సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి) రిషబ్ పంత్ తో ఇద్దరు వికెట్ కీపర్ల సమరం జరగబోతుంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై అద్భుత విజయం సాధించిన నేపథ్యంలో రాయల్స్ ఈ గేమ్ లోకి అడుగుపెట్టనుంది. కెప్టెన్ శాంసన్ అజేయ అర్ధ సెంచరీతో వారి బ్యాటింగ్ తో ఫామ్…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. 33 బంతులు ఆడిన సంజూ.. హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాకుండా.. వరుసగా ఐదు సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో 50 పరుగులు అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేసిన ఆటగాడిగా సంజూ నిలిచాడు.
భారత్-అఫ్ఘనిస్థాన్ మధ్య తొలి టీ20 మ్యాచ్ మొహాలీ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ స్థానంలో జితేష్ శర్మకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా.. అటు యశస్వి జైస్వాల్‌కు విరామం ఇచ్చినట్లు భారత కెప్టెన్ రోహిత్ తెలిపాడు.
KL Rahul Says Sanju Samson Played Really Well Today: ఆటను ఆస్వాదించండి, అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నించండని తాను యువ క్రికెటర్లకు చెప్పానని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ లోకేష్ రాహుల్ చెప్పాడు. ప్రస్తుత జట్టులో కొందరికి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేకపోయినా.. వందశాతం తమ ప్రదర్శనను ఇవ్వడానికే ప్రయత్నించారన్నాడు. ఐపీఎల్లో సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాడు అని రాహుల్ పేర్కొన్నాడు. గురువారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై…
Sanju Samson Says I Am Happy For Century in IND vs SA 3rd ODI: దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీ సాధించినందకు సంతోషంగా ఉందని కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ తెలిపాడు. గత రెండు నెలలుగా ఎంతో కష్టపడ్డానని, చివరకు ఫలితం వచ్చింనందుకు ఆనందంగా ఉందన్నాడు. భారత జట్టు విజయంలో తన పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉందని సంజూ చెప్పాడు. మూడో వన్డేలో శాంసన్ 114 బంతుల్లో 6 ఫోర్లు, మూడు…
India Beat South Africa in 3rd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 78 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 297 పరుగుల లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది. టోని జోర్జి (81; 87 బంతుల్లో 6×4, 3×6), ఐడెన్ మార్క్రమ్ (36; 41 బంతుల్లో 2×4, 1×6) రాణించారు. అర్ష్‌దీప్ సింగ్ (4/30) నాలుగు వికెట్స్ పడగొట్టాడు. ఈ విజయంతో…
Indian Fans Slams BCCI over Sanju Samson: ప్రపంచకప్ 2023 అనంతరం సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ సిరీస్ కోసం 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ప్రపంచకప్ 2023లో ఆడిన సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే చాలాకాలం నుంచి జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్న కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.…