Sanju Samson: మనసులో మాట బయటపెట్టిన శాంసన్.. అంత ఈజీ కాదేమో!
- సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్
- భారత్ తరఫున రెండో బ్యాటర్‌గా సంజూ
- టెస్టు క్రికెట్ కూడా ఆడాలనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson About Test Cricket: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు చేశాడు. 40 బంతుల్లోనే శతకం చేసి.. టీ20ల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సూపర్ సెంచరీ చేసిన సంజూపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తన బ్యాటింగ్‌తోనే విమర్శకుల నోళ్లను మూయించిన సంజూ.. తాజాగా తన మనసులోని మాటను వెల్లడించాడు. తనకు టెస్టుల్లోనూ ఆడాలని ఉందని వెల్లడించాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ మాట్లాడుతూ.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ తనను టెస్టుల్లో ఆడేందుకు సిద్ధంగా ఉండమని చెప్పినట్లు తెలిపాడు. ‘నేను టెస్టుల్లో కూడా రాణించగలననే నమ్మకం ఉంది. కేవలం టీ20, వన్డే క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావాలనే ఉద్దేశం నాకు లేదు. భారత్ తరఫున టెస్టు క్రికెట్ కూడా ఆడాలనుంది. దులీప్ ట్రోఫీకి ముందు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి సందేశం వచ్చింది. నన్ను కూడా టెస్టులకు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పింది. మరిన్ని రంజీ మ్యాచ్‌లను ఆడమని సూచించారు. నేను తప్పకుండా టెస్టుల్లో ఆడుతా’ అని సంజూ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
- Faaah : 'ఫాహ్..' వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
Also Read: Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్‌పై వేటు.. స్పందించిన బీసీసీఐ వర్గాలు!
అయితే సంజూ శాంసన్ టెస్టుల్లో చోటు దక్కించుకోవడం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే జట్టులో తీవ్ర పోటీ ఉంది. సత్తాచాటిన ఆటగాళ్లకే తుది జట్టులో స్థానం దక్కడం లేదు. ఇందుకు సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, అక్షర్ పటేల్ లాంటి వారు నిదర్శనం. మరి సంజూ టెస్టుల్లో ఎప్పుడు అరంగేట్రం చేస్తాడో చూడాలి. భారత్ తరపున 33 టీ20లు, 16 వన్డేలు ఆడిన అతడు 1100 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మాత్రం మనోడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. 168 మ్యాచ్‌లలో 4419 రన్స్ చేశాడు.
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?