Shubman Gill Dropped: టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్ స్థానం గురించి మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు గిల్‌ను జట్టు నుంచి తప్పించాలని సూచించారు.
భారత టీ20 జట్టుకు శుభ్‌మాన్ గిల్ వైస్ కెప్టెన్‌గా నియమితులైనప్పటి నుంచి ఓపెనర్‌గా ఆడుతున్నాడు. గిల్ రాకతో ఓపెనింగ్ జోడీ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ విడిపోయింది. అంతేకాకుండా సంజుకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకుండా పోతోంది. దక్షిణాఫ్రికాతో కటక్‌లో జరిగిన తొలి టీ20కి సంజు దూరమయ్యాడు. న్యూ చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఈరోజు జరిగే రెండో టీ20 మ్యాచ్‌లో కూడా అతడికి చోటు దక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో గిల్, సంజు ఫామ్ చర్చనీయాంశంగా మారింది.…
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వికెట్ కీపర్ సంజు శాంసన్ స్థానంలో జితేష్ శర్మ జట్టులోకి వచ్చాడు. టీమ్ మేనేజ్మెంట్ అంచనాలకు అనుగుణంగా రాణించాడు. స్టంప్స్ వెనుక అద్భుత ప్రదర్శన చేశాడు. మ్యాచ్‌లో చురుగ్గా ఉండడమే కాకుండా.. కొన్ని అద్భుత క్యాచ్‌లు పట్టాడు. ఇన్నింగ్స్ చివరలో 5 బంతులు ఆడి 10 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ 101 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి రెండు నెలల…
Team India Playing XI: టెస్ట్ సిరీస్‌లో ఎదురైన పరాభవం తర్వాత సౌతాఫ్రికాపై ODI సిరీస్ ను 2-1 తేడాతో గెలిచి.. ఇప్పుడు తమ దృష్టిని పూర్తిగా T20 ఫార్మాట్‌పైనే భారత జట్టు కేంద్రీకరిస్తోంది.
New Captain Sanju Samson: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ 2025-26 కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ఇప్పటికే ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ని ఎంపిక చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశం ఉంది. వేలానికి ముందు 10 జట్లు నవంబర్ 15లోపు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలి. రిటెన్షన్‌కు తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. IPL 2026కి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజు శాంసన్ కోసం జడేజాను వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సిద్ధమైందని తెలుస్తోంది.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం కోసం నవంబర్ 15 లోపు రిటైన్ లిస్ట్ ప్రకటించాలని 10 ఫ్రాంచైజీలకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ లిస్టుపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. తుది గడువుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫ్రాంచైజీలు రిలీజ్ చేసే ప్లేయర్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై…
ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన టీ20 మ్యాచ్ వరకు టీమిండియా మొదటి ఎంపిక వికెట్ కీపర్ సంజు శాంసనే. గత 12 నెలల్లో సంజు మూడు అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. కొన్ని అద్భుత ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. కానీ శుభ్‌మాన్ గిల్‌కు జట్టులో చోటిచ్చేందుకు సంజు బ్యాటింగ్ ఆర్డర్ మారింది. గిల్ కారణంగా ఓపెనింగ్ చేసే సంజు.. మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నాడు. ఇప్పుడు జితేష్ శర్మ వికెట్ కీపర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో ఏకంగా జట్టుకు దూరమయ్యాడు. ఇప్పుడు ప్రశ్న…
Gautam Gambhir: మెల్బోర్న్లోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో శుక్రవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో భాగంగా ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే భారత జట్టు ప్రారంభం నుంచే ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. దీంతో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేసి ఆల్ ఔట్ అయ్యింది.…
టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ మంగళవారం ముంబైలో జరిగిన 2025 సియట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో పాల్గొన్నాడు. టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సంజు అందుకున్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లోని సవాళ్లను, గాయాలను, జట్టుకు దూరంగా ఉన్నప్పుడు పడిన భాధను పంచుకున్నాడు. సంజు చేసిన సంవత్సరాల పోరాటం.. దేశం పట్ల అతడికి ఉన్న అపారమైన అంకితభావంకు నిదర్శనం. తన 10 ఏళ్ల కెరీర్లో కేవలం 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడానని…