RR Retention List: ఆరుగురిని రిటైన్ చేసుకున్న రాజస్థాన్.. మొదటి ఎంపిక ఎవరంటే?
- అక్టోబర్ 31 తుది గడువు
- మరికొన్ని గంటలు మాత్రమే సమయం
- రాజస్థాన్ రిటైన్ ప్లేయర్ల లిస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఇప్పటికే ఐపీఎల్ పాలక వర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఉంటుంది. రిటైన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నా.. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకుందని తెలుస్తోంది.
టీమిండియా ప్లేయర్స్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జరెల్, రియాన్ పరాగ్‌లను రాజస్థాన్ రాయల్స్ రిటైన్ చేసుకుందని తెలుస్తోంది. శాంసన్ మొదటి ఎంపికగా ఉన్నాడు. అతడికి 18 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పరాగ్‌కు 14 కోట్లు, జరెల్‌కు 11 కోట్లు ఇవ్వడానికి రాజస్థాన్ సిద్దమైందని సమాచారం. జైస్వాల్‌కు 18 కోట్లు, జోస్ బట్లర్‌కు 14 కోట్లు ఇవ్వనుందట. అన్‌క్యాప్డ్ ప్లేయర్ సందీప్ శర్మను 4 కోట్లకు తీసుకుందని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ యుజ్వేంద్ర చహల్‌ను వేలంలో తిరిగి దక్కించుకోవాలని చూస్తోందట.
Also Read
Also Read: IPL Retention 2025: అభిమానులకు శుభవార్త.. మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!
సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌లు గత 2-3 ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లైనప్‌కు మూల స్తంభాలుగా ఉన్నారు. గతేడాది విఫలమైన ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్‌పై నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ రిటైన్ జాబితాలో సందీప్ మాత్రమే స్పెసలిస్ట్ బౌలర్. పరాగ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ప్రధాన కోచ్‌గా ఫ్రాంచైజీకి తిరిగి వచ్చాడు. దాంతో ఫాన్స్ వేలంపై చాలా ఆసక్తిగా ఉన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!