భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య నేడు రెండో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. రెండో టీ20లో శాంసన్ సెంచరీ సాధిస్తే.. టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు. ఇంతకు ముందు.. శాంసన్ సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో, బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో శతకం సాధించాడు.
టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు రెండు టీ20ల్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్లు నలుగురు మాత్రమే ఉన్నారు. సంజూ శాంసన్‌తో పాటు.. ఫ్రాన్స్‌కు చెందిన గుస్తావ్ మాకెన్, దక్షిణాఫ్రికాకు చెందిన రిలే రోస్సో, ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఏ బ్యాట్స్‌మెన్ టీ20ల్లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించలేదు.
Read Also: Mohammad Rizwan: టాస్, ప్రెజెంటేషన్‌కు మాత్రమే కెప్టెన్‌ని- పాక్ కెప్టెన్..
ఓపెనింగ్ కలిసొచ్చింది..
2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సంజూ శాంసన్‌కు రెగ్యులర్ అవకాశాలు రాకపోవడంతో జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు.. అవకాశాలు వచ్చినా సత్తా నిరూపించుకోలేకపోయాడు. అయితే.. తాజాగా సంజూ శాంసన్‌కి కొత్త టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7 మ్యాచ్‌లు ఆడతాననే భరోసా ఇవ్వడంతో ఈ ఆటగాడికి అదృష్టం వరించింది. దులీప్ ట్రోఫీ సమయంలోనే సూర్యకుమార్ యాదవ్ తన ఆటతీరు ఎలా ఉన్నా, వచ్చే 7 మ్యాచ్‌ల్లో తనకు అవకాశం ఇవ్వబోతున్నట్లు చెప్పాడని శాంసన్ వెల్లడించాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో శాంసన్ పెద్దగా రాణించలేకపోయినప్పటికీ.. చివరి టీ20లో సెంచరీ చేశాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటన అతని కెరీర్‌కు చాలా కీలకంగా మారింది. మొదటి టీ20లో సెంచరీ చేయగా.. తర్వాత మూడు మ్యాచ్‌లలో రెండింటిలో 50 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే, అతను ఓపెనింగ్ స్లాట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవచ్చు.