Sanjay Raut comments on Karnataka-Maharashtra border dispute: కర్ణాటక-మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చరాజేస్తోంది. బెలగావి ఈ మొత్తం సమస్యకు కేంద్రం అవుతోంది. గత కొన్ని దశాబ్ధాలుగా కర్ణాటకలోని బెలగావి తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం) నేత సంజయ్ రౌత్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోకి చైనా ప్రవేశించినట్లే.. కర్ణాటకలోకి మేం అడుగుపెడతాం అంటూ సరికొత్త…
Sanjay Raut comments : శివసేన పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో శ్రద్ధను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అఫ్తాబ్ పూనావాలాను బహిరంగంగా ఉరితీయాలన్నారు.
కొంతమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి పార్టీలోకి వస్తారని శివసేన (ఉద్ధవ్ వర్గం) నాయకుడు సంజయ్ రౌత్ శుక్రవారం ప్రకటించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద బెయిల్‌పై విడుదలైన రెండు రోజుల తర్వాత మాట్లాడుతూ, అటువంటి కేసులన్నింటినీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలించాలని కూడా అన్నారు.
ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు.
పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు సోమవారం 14 రోజులు పొడిగించింది.
పత్రాచల్ భూ కుంభకోణానికి సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడిషియల్ కస్టడీని 14 రోజుల పాటు సెప్టెంబరు 19 వరకు పొడిగిస్తూ ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఎ) కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పత్రాచాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోమవారం జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించారు. సోమవారం ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (PMLA) కోర్టు అతని కస్టడీని సెప్టెంబర్ 5 వరకు పొడిగించింది.
పత్రాచల్ ల్యాండ్ కేసుకు సంబంధించి శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఆగస్టు 22 వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబయిలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పత్రాచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.
వసేన సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. పత్రాచల్ భూకుంభకోణంలో నగదు అక్రమ చలామణి కేసుకు సంబంధించి ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు లోతైన విచారణ కోసం రౌత్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అంతకుముందు ప్రకటించారు.
ముంబైలోని పత్రాచాల్ భూకుంభకోణం కేసులో శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదివారం ఆయన నివాసంలో గంటల కొద్దీ దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు కూడా రౌత్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించింది. ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సీఐఎస్ఎఫ్ అధికారులతో పాటు ఈడీ బృందం రౌత్ నివాసానికి చేరుకుంది.