మహారాష్ట్ర ముఖ్యమంత్రి మళ్లీ మారుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెబుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా దిగిపోయి.. ఆయన స్థానంలో అజిత్ పవార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు.
Sanjay Raut: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ తిరుగుబాటు చేశారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు షాక్ ఇస్తూ.. షిండే-ఫడ్నవీస్ ఎన్డీయే ప్రభుత్వంలో చేరారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఏకంగా 40 మంది అజిత్ పవార్ వెంట నిలిచారు.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌తో కలిసి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన 2019 ప్రయోగం విఫలమైందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గురువారం అన్నారు.
ప్రత్యర్థి సేన వర్గానికి చెందిన నాయకుడు రాహుల్ షెవాలేపై శివసేన(యూబీటీ) పార్టీ మౌత్‌పీస్ 'సామ్నా' ప్రసారం చేసిన పరువు నష్టం కలిగించే కథనాలపై శివసేన (యూబీటీ) నాయకులు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌లకు ఇక్కడి మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది.
శాసన మండలి సభ్యురాలు (MLC) మనీషా కయాండే ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. మనీషాను ఎగతాళి చేస్తూ, సంజయ్ రౌత్ ఆమెను చెత్త అని పిలిచారు.
Sanjay Raut: 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ఉద్ధవ్ ఠాక్రే ద్రోహం చేశారని అమిత్ షా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై శివసేన(యూబీటీ) నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విరుచుకపడ్డారు. ఉద్దవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. శనివారం నాందేడ్ లో జరిగిన అమిత్ షా ర్యాలీని సంజయ్ రౌత్ ప్రస్తావసి్తూ.. ఉద్ధవ్ ఠాక్రేని చూసి బీజేపీ భయపడటం విశేషం…
Sanjay Raut: భారతీయ జనతా పార్టీ(బీజేపీ)పై ఘాటు విమర్శలు చేశారు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్. శనివారం బీజేపీని మొసలి, కొండచిలువతో పోల్చారు. ఒకరు రోజు ముందు శివసేన ఎంపీ గజానన్ కీర్తీకర్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి శివసేన పార్టీపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణల తర్వాత ఈ రోజు సంజయ్ రౌత్ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
Sanjay Raut attacks BJP: కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై సంజయ్ రౌత్ ఈరోజు మరోసారి లేవనెత్తారు. ఎల్కే అద్వానీ జీవితం పార్లమెంటులోనే గడిచిందని, దాని వల్లే ఈరోజు బీజేపీ ఈ స్థానానికి చేరుకుందని, ఆయనను కూడా మరిచిపోయారా?
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ కూటమి కొనసాగుతోంది. ప్రస్తతం ప్రతిపక్షంలో ఉన్న ఈ కూటమి మధ్య చీలిక వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాయకుల మధ్య విభేదాల కారణంగా కూటమికి బీటలు వారాయి అని చర్చలు జరుగుతున్నాయి.
గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. తనకు మొబైల్ టెక్ట్స్ సందేశాల ద్వారా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆయన తెలిపారు.