Sanjay Raut: శివసేన నేత సంజయ్ రౌత్‌కు ఊరట.. 3 నెలల తర్వాత ఎట్టకేలకు బెయిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. పత్రాచల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. బెయిల్ పిటిషన్‌పై తన నిర్ణయాన్ని అక్టోబర్ 21న రిజర్వ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు కావడానికి ముందు, రాజ్యసభ ఎంపీ రెండుసార్లు ఈడీ సమన్లను దాటవేశారు.రాజకీయ పగతో తనపై తప్పుడు కేసు పెట్టారని రౌత్ ఆరోపించారు.ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాల మధ్య సేన నియంత్రణ కోసం తీవ్ర వాగ్వివాదం మధ్య రాజ్యసభ ఎంపీ అరెస్టు జరిగింది.
రౌత్ నిర్దోషి అయితే అతనిపై కేంద్ర ఏజెన్సీ దర్యాప్తుకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన అరెస్టు తర్వాత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. సంజయ్ రౌత్ అరెస్ట్ అనంతరం మద్దతుదారులు భారీ నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రతీకార ఆరోపణలను ఈడీ తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ ప్రమేయం ఉందని పేర్కొంది.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
MP K.Laxman : కేంద్ర సహకారంతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బాటలు
పత్రాచల్ భూకుంభకోణంతో సంజయ్ రౌత్, ఆయన సతీమణి వర్షా రౌత్ సహా మరికొంతమందికి సంబంధం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ క్రమంలోనే వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్ల విలువచేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణం కేసుకు సంబంధించి రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!