Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్, అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. బీజేపీ హిట్లర్ ప్రచారం వ్యవస్థల పనిచేస్తోందని, అధికారంలో ఉన్న వారు గోమూత్రాన్ని మాత్రమే చూస్తారని ఆయన గురువారం అన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు మాత్రమే కనిపిస్తున్నాయని అన్నారు. ప్రైవేటీకరణ, తప్పుడు ప్రచారం చేయడం, ముస్లిం సమాజంపై ద్వేషాన్ని పెంచడం, దూకుడు జాతీయవాదం ఇది బీజేపీ ప్రధాన అంశాలని శరద్ పవార్ అన్నారు.
Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలో విజయంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నట్లైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓడిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Sanjay Raut : దేశంలో మూడు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
Sanjay Raut: ఈ రోజు జరుగుతున్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై యావత్ భారత్ ఆశలు పెట్టుకుంది. ఇండియన్ ఫ్యాన్స్ రోహిత్ సేన వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్నారు. అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచు కోసం లక్షలాది మంది చేరుకున్నారు. దీనికి తోడు ప్రధాని మోడీతో పాటు ఆస్ట్రేలియన్ డిఫ్యూటీ పీఎం, విదేశీ రాయబారులు, బాలీవుడ్ సెలబ్రెటీలు వస్తున్నారు. దీంతో స్టేడియంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ప్రస్తుతం ఆలయం దాదాపుగా నిర్మించబడింది, విగ్రహ ఏర్పాటు జనవరి 22న నిర్వహించబడుతుంది, ప్రధాని మంత్రిని ఆహ్వానించాం, ఆయన మా ఆహ్వానాన్ని అంగీకరించారని అన్నారు. ఇది కేవలం త్యాగాల గురించి కాదని, భక్తి, విశ్వాసాలకు సంబంధించిందని ఆయన అన్నారు.
Sanjay Raut: ఇండియాలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరుగుతోంది. అయితే పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఘనస్వాగతం పలకడం పలువురు ఇండియన్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. ఈ విజయంపై ఇటీవల బీసీసీఐని నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా శివసేన(ఉద్దవ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Yogi Adityanath: దేశం మొత్తం ప్రస్తుతం ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’పై చాలాా చర్చ నడుస్తోంది. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సెప్టెంబర్ 18-22 వరకు నిర్వహించడం.. తాజాగా ఈ రోజు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ చీఫ్ గా మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌ని నియమించింది.
మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి మెజారిటీ సాధించిన తర్వాత సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే పేరును తమ పార్టీ ప్రతిపాదించిందని ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కానీ దాన్ని బీజేపీ పార్టీ తిరస్కరించింది అని ఆయన తెలిపారు.
ప్రతిపక్ష కూటమి 'ఇండియా' మూడో సమావేశం ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో ముంబైలో జరుగుతుందని కాంగ్రెస్, శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఈరోజు ప్రకటించాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ హోదాను పునరుద్ధరించడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు జాతీయ పార్టీలో చేరిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్థానంలో ఉండవచ్చని ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ బుధవారం అన్నారు.