బీజేపీపై శివసేన (యూబీటీ) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రధాని మోడీ మాల్దీవులతో గొడవపడుతున్నారని ఆరోపించారు. ‘పాకిస్తాన్‌తో యుద్ధ సమస్య ముగిసినప్పటికీ.. బీజేపీ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికలకు ముందు సొంత సైన్యం, పోలీసు బలగాలు లేని మాల్దీవులతో పోరాడుతోందన్నారు. మాల్దీవులతో వివాదాన్ని పెంచి ఎన్నికల్లో ఆ పేరుతో ఓట్లు వేయించుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Read Also: Jupalli Krishna Rao: కేటీఆర్ వల్ల పండుగరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది : జూపల్లి
సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘చైనాతో చెలగాటమాడే ధైర్యం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు లేదు అన్నాడు. రాహుల్ గాంధీ చెప్పిన తప్పేముంది? ఈ రాజకీయం దేశ ప్రయోజనాలకు సంబంధించినది కాదు.. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్నికల రాజకీయం అని ఆయన విమర్శించారు. రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదన్న శివసేన (యుబిటి) నేతల ప్రశ్నకు సంజయ్ రౌత్ మండిపడ్డారు. రాముడు బిజెపి ప్రైవేట్ ఆస్తి కాదు.. ఆహ్వానం పొందిన వారు వెళ్లాలి, అందని వారు కూడా వెళ్లాలి అని చెప్పాడు. ఏళ్ల తరబడి వివాదం ఉన్న స్థలంలో రామమందిరాన్ని నిర్మించడం లేదని సంజయ్ రౌత్ ఆరోపించారు. గుడి కట్టాలనే చర్చ జరిగిన చోట గుడి కట్టలేదు.. అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆ వివాదాస్పద స్థలం ఇప్పటికీ అలాగే ఉంది.. దీనిపై బీజేపీ మాట్లాడాలి అని ఆయన డిమాండ్ చేశారు.