Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: అలా అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మరిన్ని కష్టాలు..ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలో విజయంతో హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నట్లైంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓడిపోయింది. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన మౌత్ పీస్ సామ్నా పత్రికలో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈవీఎంలపై సందేహాన్ని లేవనెత్తారు. ప్రధాని నరేంద్రమోడీకి అనుకూలంగా రాజకీయాలు చేసే వ్యక్తులు గాంధీ కుటుంబం చుట్టూ ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మరిన్ని కష్టాలు తప్పవని సంజయ్ రౌత్ ఆదివారం హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ చీఫ్ కమల్‌నాథ్‌ని ఉద్దేశించి రౌత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
Read Also: Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరంలో పూజారిగా యూపీ విద్యార్థి..ఎవరీ మోహిత్ పాండే..?
మధ్యప్రదేశ్ ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్199 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని, ఈవీఎంలో ఓట్లు లెక్కించే సమయంలో పరిస్థితి మారిపోయిందని అన్నారు. ప్రధాని మోడీ గెలుపు మాయాజాలం మూడు రాష్ట్రాల్లో పనిచేసిందని, తెలంగాణలో మాత్రం పనిచేయలేదని అన్నారు. ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ ఓడించలేదనేది అపోహ అని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిందని, 2018లో ఈ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల గురించి ప్రస్తావించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాజీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ పోరాడారని, అయినా కూడా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!