Thief Forgot Phone: ఒక దొంగ దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకునే పనిలోపడ్డాడు. ఇంతలోనే ఫోన్ చూస్తుండగా బ్యాటరీ డెడ్ అయింది. అక్కడే టేబుల్ పై చార్జర్ గమనించాడు. అక్కడకు వెళ్లి తన ఫోన్ ఛార్జింగ్ పెట్టి తన పని తాను చేసుకుంటున్నాడు. ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టి తాను అనుకున్న ప్రకారం ముందుగా ఇంట్లో ఉన్న సొత్తు చోరీ చేసేందుకు ఇంటి చుట్టూ తిరిగాడు. ఇంతలో ఇంటి యజమాని ఎంట్రీ ఇవ్వడంతో దొంగ మెల్లగా అక్కడి నుంచి పరారయ్యడు. అయితే వెలుతున్నప్పుడు తన ఫోన్ చార్జింగ్ పెట్టింది మర్చిపోయి వెళ్లిపోయాడు. దీంతో ఇంటి యజమాని ఆ ఫోన్ చూసి పోలీసులకు ఇచ్చాడు. ఈ వింత దొంగతనం ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో చోటుచేసుకుంది.
Read also: Canada: నార్వే వరకు సాగిన కెనడా కార్చిచ్చు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పట్టణంలోని సాయిరాం కాలనీలో కమాలుద్దీన్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. అయితే ఇంట్లో యజమాని, కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. తమ ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోవడంతో దానికి ఛార్జింగ్ పెట్టి భారీగా సొత్తు దోచుకునే పనిలో పడ్డారు. ఇంటిని పగులగొట్టి 12 తులాల బంగారం, 69 తులాల వెండి, రూ.24 వేలు నగదు అపహరించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన యజమాని ఒక్కసారిగా నిద్రించేందుకు ఇంటికి వచ్చాడు. అది గమనించిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. దొంగలను పట్టుకునేందుకు ఇంటి యజమాని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే దొంగలు సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టి అక్కడే మరిచిపోయారు. దానిని స్వాధీనం చేసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
MLA Prasannakumar Reddy: చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు..