Sangareddy Crime: పేలిన గ్యాస్ సిలిండర్.. పక్కనే ఉన్న మరో ఇంటికి అంటుకున్న మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangareddy Crime: సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఓ ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు సిలిండర్ పేలింది. దీంతో భారీ శబ్దం రావడంతో.. స్థానికులు ఏం జరిగిందో అంటూ బయటకు పరుగులు పెట్టారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపడింది. ఇంటికి మొత్తం మంటలు అంటుకున్నాయి. పెంకుటిల్లు కావడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక పక్కనే ఉన్న మరో ఇంటికి మంటలు అంటుకున్నాయి. మంటలను ఆర్పే స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఓకుటుంబం నివాసం ఉంటుంది. రోజూ లాగానే లేచిన మహిళ వంట చేసేందుకు గ్యాస్ అంటించింది. అంతే ఒక్క సారిగా భారీ శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. బయటకు వచ్చిన స్థానికులకు అరుపులు వినపడంతో గ్యాస్ పేలిన ఇంటి వైపు పరుగులు పెట్టారు. అక్కడి వెళ్లి చూడగా.. భారీగా మంటలు ఉవ్వెత్తున చెలరేగుతున్నాయి. కొందరు నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిసి పడింది. పక్కనే ఉన్న మరో ఇంటికి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు, పొగ కమ్ముకుంది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఇంట్లో ఎంత మంది ఉన్నారు, మృతుల విషయం పై ఇంకా క్లారిటీలేదు. స్థానిక సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Bengaluru Traffic: లంచ్ @ ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
Also Read
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?