Bandi Sanjay : సంగారెడ్డిలో నిరుద్యోగ మార్చ్.. బీజేపీ కార్యకర్తలు రావాలన్న బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’ను దిగ్విజయవంతం చేసి సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మార్చ్ కు జాతీయ కార్యవర్గ సభ్యులు జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొంటారని వెల్లడించారు. ఈ నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుంచి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Also Read : Karnataka Election: కర్నాటకలో ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల్లో వందల కోట్ల బెట్టింగ్‌లు..!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజల బతుకు అథో:గతి పాలవుతున్నా సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణం అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు.
Also Read : RCB vs MI: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ముంబై ముందు భారీ లక్ష్యం
తూతూ మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. సిట్ దర్యాప్తు నిందితులకు కొమ్ముకాయడానకే పనిచేస్తోంది తప్ప నివేదిక ఇచ్చిన దాఖలాల్లేవు అని అన్నారు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు.
Also Read : Aravind Swami: మణిరత్నం హీరో ప్రమోషన్స్ లో కనిపించడేం..?
తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీజేపీ చేస్తున్న ఉద్యమాలను గమనిస్తున్నారు అని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేశారు. ఈ నెల 11న సంగారెడ్డి జిల్లాలో చేపట్టే నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేసి ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీకి అడ్డా అని నిరూపించాలన్నారు. అందుకోసం నిబద్ధత కలిగిన కార్యకర్తలంతా ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలి.. పోలింగ్ బూత్ సభ్యులంతా ఒక్కొక్కరు కనీసం వందమందిని తీసుకురావాలి. మీడియా, సోషల్ మీడియాలో విస్త్రత ప్రచారం నిర్వహించాలి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!