Bridegroom escape: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి.. అంతలోనే పెళ్లి కొడుకు ఉహించని ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bridegroom escape: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. పెద్దలు ఒప్పకోకపోవడంతో.. ఇది కాస్త పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లింది. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. అయితే.. వీరి ప్రేమకు తెలిసి మధ్యలోనే తెగిపోయింది. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను చాలా కష్టాల తర్వాత ప్రియుడితోనే పెళ్లికి ఒప్పించారు. శుక్రవారం వివాహానికి సమయం. పెళ్లి పనులు నిర్వహించిన ఇరు కుటుంబాల పెద్దలు మండపానికి చేరుకున్నారు. కొద్ది నిమిషాల్లో పెళ్లి. ఇంతలో పెళ్లి కొడుకు ట్విస్ట్ ఇచ్చాడు. కట్నం సరిపోకపోవడంతో పెళ్లి కొడుకు పెళ్లి పీటల నుంచి పారిపోయాడు. ప్రేమించిన అమ్మాయిని తిరస్కరించి డబ్బే ముఖ్యమని పారిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా మనూరు మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అయితే తమ కుమార్తెను ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాదు ఈ ఏడాది జనవరిలో బాలికకు అదే జిల్లా కంగ్టి మండలానికి చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిగింది. యువతి పెళ్లి విషయం తెలుసుకున్న ప్రియుడు అతడికి ఫోన్ చేసి.. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు. దీంతో నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయమై బాలిక ఇంట్లో గొడవ జరగగా.. చివరికి ప్రేమికులిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. శుక్రవారం (మే 26) కొండాపూర్ మండలంలోని ఓ ఆలయంలో పెళ్లికి సర్వం సిద్ధం చేశారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
అయితే పెళ్లి చివరి నిమిషంలో పెళ్లి కొడుకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. రూ.15 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. అంత కట్నం ఇవ్వలేమని, రూ.6 లక్షలు ఇస్తామని యువతి కుటుంబీకులు చెప్పినా వరుడు వినలేదు. ఇరు కుటుంబాల పెద్దలు కట్నం గురించి మాట్లాడుతుండగా.. పెళ్లి పీటలపై నుంచి యువకుడు అందరి కళ్లుగప్పి పారిపోయాడు. యువకుడి కోసం సమీప ప్రాంతాల్లో వెతికినా.. ఫలితం లేకపోయింది. ఫోన్ చేసినా స్విచ్ రావడంతో బాలిక బంధువులు పోలీసులను ఫిర్యాదు చేశారు. తన కూతురి జీవితంతో వరుడు అట్లాడుకున్నాడని, కట్నం కోసం పెళ్లి పీఠలపై నుంచి వెళ్లిపోయాడని వాపోయాడు. ఇక తన కూతురికి దిక్కెవరని కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు.
Wife Killed Husband: అతనేం చేశాడని పెళ్లిరోజే పైకి పంపావు తల్లి
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!