మిస్టర్ నడ్డా తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అంటూ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫేక్ సర్వేలు పెడుతుంది.. బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు అని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్ దెబ్బకు బిజెపి డక్ ఔట్..కాంగ్రెస్ రన్ ఔట్..కేసీఆర్ సెంచరీ చేయడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 30 స్థానాల్లో అభ్యర్థులే లేరు.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చుడే ఎక్కువ.
BJP Meeting: సంగారెడ్డిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు కమలం పార్టీలో జాయిన్ అయ్యారు.
ఈ రోజు జరిగే బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తదితరులు హాజరవుతారని, వారి సమక్షంలో బీజేపీలో చేరుతానని సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పులిమామిడి రాజు చెప్పారు.
Sangareddy: సంగారెడ్డిలో అర్ధరాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. SFI, ABVP విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నేడు SFI రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఉండటంతో SFI కార్యకర్తలు జెండాలు కడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చంద్రశేఖర్ కీలక కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. చేవెళ్ల సభలో నేను హోంమంత్రి అమిత్ షా కి శాలువా కప్పితే దళితుడిని నిరాకరించారు అని ఆరోపించాడు.
Minister Errabelli: తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకం ఫోర్జరీ వ్యవహారం కలకలం రేపింది. అలాగే మంత్రి లెటర్ హెడ్ తో పాటు సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెలుస్తోంది.
నరేంద్ర మోడీ, కేసీఆర్, రాహుల్ గాంధీని ఢీ కొట్టే శక్తి కేఏ పాల్ కే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కవితని ఈడీ అరెస్ట్ చేయకపోతే బీజేపీ 40 సీట్లు గెలుస్తుంది అని చెప్పాను.. ఇదంతా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం ఉందని పాల్ అన్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఉన్న చాలా మంది మంత్రులు నాతో టచ్ లో ఉన్నారు.
Cheddi Gang: తెలంగాణ రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్, రామచంద్రాపురంలోని పలు కాలనిలో వరుస దొంగతనాలకు గ్యాంగ్ పాల్పడుతుంది.
సంగారెడ్డి జిల్లాలో కేంద్రంలో ఉన్న ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో ఇప్పటివరకు ఏడుగురు విద్యార్థుల ఆత్మహత్య చేసుకున్నారు. ఇక, వరుసగా ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. 2022-23 ఏడాది వ్యవధిలోనే ఇప్పటి వరకు నలుగురు ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు.