New Bride Escape: ఇటీవలి కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బంధాలు అనుబంధాలకు పరిగణనలోకి తీసుకోకుండా ఆర్థిక అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. డబ్బు కోసం ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకులను వలపన్ని వారిని మోసం చేసి డబ్బులతో పరార్ అవుతున్నారు. అందినకాడికి దోచుకుని పారిపోతున్నారు.వివాహానే దొంగతనాలకు దారిగా ఎంచుకుంటున్నారు. కొత్తగా పెళ్లైన తర్వాత పెళ్లికూతుర్లు నగలు, నగదులో ఉడాయించిన సంఘటనలు మనం గతంలో చూశాము. మరోసారి మెదక్ జిల్లాలో ఇదే సీన్ రిపీట్ అయింది. పెళ్లి పేరుతో ఓ యువకుడిని మరో రాష్ట్రానికి చెందిన యువతి మోసం చేసింది. కాగా.. పెళ్లైన నెలరోజులకే ఇంట్లో దాచి ఉంచిన రూ. 2 లక్షల నగదుతో ఉడాయించింది. ఇక మోసపోయిన యువకుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
మెదక్ జిల్లా లింగారెడ్డిపల్లికి చెందిన రాజేశ్వర్ పటాన్చెరు మండలం పాశమైలారంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఒడిశాకు చెందిన యువతి రష్మిక ప్రవాలాతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత నెల 23న ఓ గుడిలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం పాశమైలారంలోనే కాపురం పెట్టారు. రష్మిక ఇంట్లోనే ఉండగా రాజేశ్వర్ ఇండస్ట్రీకి వెళ్లేవాడు. కానీ రాజేశ్వర్ ఇటీవల రూ. 2 లక్షల నగదును తిరిగి సేకరించి ఇంట్లోని బీరువాలో పెట్టాడు. ఆ డబ్బుపై రష్మిక కళ్లు పడ్డాయి.
ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. సమయం కోసం ఎదురుచూసింది. రాజేశ్వర్ శనివారం పరిశ్రమకు వెళ్లగా, ఇంట్లో రష్మిక ఒంటరిగా ఉంది. ఇదే సమయం అని భావించిన రష్మిక రూ. 2 లక్షలతో పరారైంది. ఇంటి వచ్చిన రాజేశ్వర్ కు రష్మిక కనిపించలేదు భార్య ఏమైపోయిందో అని కంగారు పడ్డ రాజేశ్వర్ కు మరో విషయం తెలిసింది. అదే తను వసూలు చేసిన రూ. 2 లక్షలు కూడా మాయమయ్యాయని. తను మోసపోయానని గమనించిన రాజేశ్వర్ BDL భానూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనను ప్రేమ పేరుతో మోసం చేసి రూ. 2 లక్షలతో తన భార్య పరారయ్యిందని తనకు న్యాయం చేయాలని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rahul Gandhi: ప్రతేడాది ఇస్తామన్న 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్