హరిత తెలంగాణ దిశగా ఎంపీ సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో స్టార్ హీరోలతో పాటు రాజకీయ నాయకులు పాల్గొనగా తాజాగా పాన్ ఇండియా నటుడు సముద్ర ఖని పాలు పంచుకున్నారు.
ఐదు జంటల కథతో సాగే ఆంథాలజీ మూవీ 'పంచతంత్రం'. డిసెంబర్ 9న ఈ మూవీ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ను శనివారం స్టార్ హీరోయిన్ రశ్మికా మందణ్ణ విడుదల చేశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. 2024లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కమిట్ అయిన సినిమాలను చకాచకా పూర్తి చేసి ఆ తర్వాత 2023లో పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెడతాడని వినిపించింది. ఇదిలా ఉంటే పవన్ కమిట్ మెంట్స్ లో హఠాత్తుగా మరో సినిమా యాడ్ అయింది. ఆల్ రెడీ పూజ కూడా జరుపుకుందని సమాచారం. దీనికి నటుడు, దర్శకుడు సముతిర ఖని దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది తమిళంలో సముతిర…
తమిళంలో మంచి విజయం సాధించిన ‘వినోదయం సీతమ్’ను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే! ఒరిజినల్‌కి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ప్రధాన పాత్రలో నటించిన సముద్రఖని ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు పవన్ 20 రోజుల డేట్స్ ఇచ్చినట్టు గతంలోనూ వార్తలొచ్చాయి. అయితే, ఇది ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందన్నదే స్పష్టత రాలేదు. అదిగో, ఇదిగో అంటూ.. యూనిట్ సభ్యులు చెప్పడమే తప్ప, ఇంతవరకూ పట్టాలెక్కలేదు. నిజానికి.. భీమ్లా నాయక్…
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు సముతిరకని. తమిళనాట నటదర్శకునిగా సాగుతున్న సముతిరకని అనేక తెలుగు చిత్రాలలో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆయన తమిళంలో రూపొందించిన కొన్ని సినిమాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. దర్శకునిగానూ తెలుగులో కొన్నిచిత్రాలు తెరకెక్కించారు. ఇక ‘అల…వైకుంఠపురములో’, ‘ట్రిపుల్ ఆర్’ సినిమాలతో సముతిరకని నటునిగానూ తెలుగువారికి దగ్గరయ్యారు . సముతిరకని దర్శకత్వంలో రూపొందిన ‘వినోదయ సిథమ్’ చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. సముతిరకని 1973 ఏప్రిల్…
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. ఆమెకు ప్రస్తుతం చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. మొదటి సినిమా మొదలుకొని ఆమె నటించిన అన్ని సినిమాలూ దాదాపు హిట్ గానే నిలిచాయి. దీంతో ఈ అమ్మడికి ఆవేశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే కృతి కూడా సెలెక్టివ్ గానే సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా పవన్…
టాలీవుడ్ లో మరో మెగా మల్టీస్టారర్ రాబోతోందా ? అంటే అవుననే అన్పిస్తోంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది.పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక మెగా మల్టీస్టారర్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ…
నటి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. పూజ నటించిన మలయాళ సినిమా ‘చిత్తిరై సెవ్వానం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో పూజ సముద్రఖని కూతురిగా కీలక పాత్రలో కనిపించనుంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ సిల్వా దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్ చూసిన వారిలో చాలా మంది పూజను సాయిపల్లవిగా భావిస్తుండటం విశేషం. నిజజీవితంలో కూడా వీరిద్దని పలువురు కవలలుగా…
హిందీ చిత్రం ‘అంధాధున్’ ఇటు తెలుగులోనే కాదు అటు తమిళంలోనూ రీమేక్ అవుతోంది. తెలుగులో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘మాస్ట్రో’ అని పేరు పెట్టగా, తమిళంలో ప్రశాంత్ తో ‘అందగన్’ పేరుతో ఆయన తండ్రి త్యాగరాజన్ రీమేక్ చేస్తున్నాడు. దీనికి ఆయనే దర్శక నిర్మాత. హిందీలో రాధికా ఆప్టే పాత్రను తమిళంలో ప్రియా ఆనంద్ చేస్తోంది. ఇక టబు పాత్రను సిమ్రాన్ పోషిస్తోంది. ఇందులో ఆమె భర్త పాత్రను సముతిర కని పోషిస్తున్నాడు. సోమవారం ఈ…