Dhanush: ‘సార్’ గురించి భారతీరాజా ఏమన్నారంటే….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sir: ప్రముఖ దర్శకుడు భారతీరాజా, ధనుష్ నటించిన తాజా చిత్రం ‘వాతి’ (‘సార్’) పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా, విద్యను ప్రోత్సహించడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన చిత్రంగా అభివర్ణించారు. “నా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను చూశాను. కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అలాంటి వాటిలో ‘సార్’ ఒకటి. నేను చాలా సినిమాలు చూస్తున్నాను, నేను ఇందులో భాగమైనందున ఇది ప్రత్యేకమైనది. సినిమాలు వినోదం పంచడం కంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి సినిమాల్లో ఇదీ ఉంది. ఇందులో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు” అని భారతీరాజా ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ చిత్రా కథానాయకుడు ధనుష్ ను, కీలకపాత్ర పోషించిన సముతిర ఖని, సంయుక్త ను భారతీరాజా అభినందించారు. ”సార్’ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం జీవీ ప్రకాష్ కి రావడం గొప్ప విషయమని, ఆయన ఈ సంవత్సరం అద్భుతమైన సంగీతాన్ని అందించారని, ఈసారి జాతీయ అవార్డు అందుకోవడం ఖాయమ’ని భారతీరాజా అన్నారు. అలానే ‘సార్’ అనే టైటిల్ గొప్పదని,
ఈ చిత్రం ఉపాధ్యాయుని సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతుంద’ని భారతీరాజా తెలిపారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని భారతీ రాజా ప్రజలను కోరారు. “నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్న తీరు బాగుంది. ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఇదొకటి. ఇది థియేటర్‌లో తప్పక చూడవలసిన చిత్రం. మీరు ఈ సినిమాని థియేటర్లలో చూసి, ఆ అనుభూతిని నాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను” అని భారతీరాజా అన్నారు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ అండ్ శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ‘సార్’ చిత్రాన్ని నిర్మించాయి. ఫిబ్రవరి 17, 2023న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.
Also Read
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
తాజావార్తలు
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
-
Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
-
Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా ‘సూరి’
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!