ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ మూవీలో కఠారి శ్రీనుగా నటించి, ఆకట్టుకున్నాడు సముతిరకని. బేసికల్ గా చక్కని రచయిత, దర్శకుడు అయిన సముతిరకని కొంతకాలంగా అర్థవంతమైన పాత్రలూ పోషిస్తున్నారు. తెలుగులోనూ రెండు మూడు చిత్రాలను డైరెక్ట్ చేసిన సముతిరకని, ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘ఆకాశవాణి’లో చంద్రమాస్టారు పాత్ర పోషిస్తున్నాడు. అలానే హర్ష పులిపాక దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పంచతంత్రం’లో రామనాథం అనే…