‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు. ఆమెకు ప్రస్తుతం చేతిలో అర డజను సినిమాలు ఉన్నాయి. మొదటి సినిమా మొదలుకొని ఆమె నటించిన అన్ని సినిమాలూ దాదాపు హిట్ గానే నిలిచాయి. దీంతో ఈ అమ్మడికి ఆవేశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. అయితే కృతి కూడా సెలెక్టివ్ గానే సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ ను కొట్టేసింది. “వినోదయ సీతమ్” అనే తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. సముద్రకని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్, సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్టుగా టాక్ నడుస్తోంది.
Read Also : RRR : రికార్డు బ్రేకింగ్ ప్రీ సేల్స్… యూఎస్ లో నందమూరి ఫ్యాన్స్ రచ్చ
ఇక ఇప్పుడు ఈ సినిమాలో సాయి తేజ్ సరసన నటించడానికి కృతిశెట్టిని సంప్రదించారట మేకర్స్. కృతి శెట్టితో చర్చలు చివరి దశలో ఉన్నాయని, ఆమె ఓకే చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ను మొత్తం రెండు షెడ్యూల్స్‌లో 40 రోజుల్లో పూర్తి చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ తన భాగాన్ని పూర్తి చేయడానికి ఈ సినిమాకు 21 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడు. ఏప్రిల్‌లో సినిమాను ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నారు. జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఏప్రిల్ లో “హరిహర వీర మల్లు” షూటింగ్‌ని పునఃప్రారంభించనున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.