విజయ్ దేవరకొండ సినిమాలన్నాక.. కనీసం ఒక్క ముద్దు సన్నివేశం లేదా రొమాంటిక్ సీన్ ఉండాల్సిందే! ‘అర్జున్ రెడ్డి’ నుంచి విజయ్ ఈ రొమాంటిక్ ‘దండయాత్ర’ను కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు సమంతతో చేస్తోన్న ‘ఖుషీ’ చిత్రంలోనూ అలాంటి సీన్లు ఉండనున్నాయని సమాచారం. అది కూడా కేవలం ఒకటో, రెండో కాదు.. చాలా ఇంటిమేట్ సీన్లు ఉంటాయట! ముఖ్యంగా.. వీరి మధ్య ఒక ఇంటెన్స్ లిప్‌లాక్ సీన్ కూడా ఉండనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదో పూర్తిస్థాయి రొమాంటిక్ సినిమా కావడం…
బాలీవుడ్ మీద మోజుతో, అక్కడికెళ్ళిన దక్షిణాది భామలకు దాదాపు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం, ఆఫర్లు కూడా అంతంత మాత్రమే రావడం, అందునా సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితం కావడం లాంటివి జరిగాయి. ఒకరిద్దరు మినహాయిస్తే, మిగతా హీరోయిన్ల పరిస్థితి అక్కడ ఆల్మోస్ట్ గల్లంతే! ఇదీ.. మన దక్షిణాది భామలపై బాలీవుడ్‌కి ఉన్న చిన్నచూపు! పచ్చిగా చెప్పాలంటే.. కూరలో కరివేపాకులా చూస్తారు. ఇప్పుడు సమంత విషయంలోనూ బాలీవుడ్ మేకర్స్ అలాంటి వ్యవహార శైలే…
సౌత్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ మొత్తం స్నేహితులే.. వారు, వీరు అని లేకుండా అందరితో సామ్ ఎంతో సన్నిహితంగా ఉంటోంది. ఇక సామ్ స్నేహితులు ఎంతమంది ఉన్నా ఆమె బెస్ట్ ఎవరు అంటే తక్కువ శిల్పారెడ్డి పేరు చెప్పేస్తారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కష్టనష్టాల్లో ఉన్నవారికి ఒక ఫ్రెండ్ ఇచ్చే ఓదార్పు మాటలో చెప్పలేనిది. తన కుటుంబంలో ఒకరిగా చూసుకొనే స్నేహితులు చాలా అరుదు. అలాంటివారిలో సామ్ కి దొరికిన…
పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ గడించిన కథానాయికల్లో సమంత ఒకరు. అయితే, ఆమె ఈ స్థాయికి అంత ఈజీగా చేరుకోలేదు. ఎన్నో కష్టాలు, సవాళ్ళను ఎదుర్కొని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. జెస్సీ (ఏం మాయ చేశావే)గా యువత మనసు దోచిన ఈ భామ.. ఆ తర్వాత నటన పరంగా ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. అందంతో నెట్టుకొస్తోందే తప్ప, యాక్టింగ్ రాదంటూ ఎందరో పెదవి విరిచారు. అలాంటి వాళ్ళందరి…
యూత్ లో ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. ఇక విడాకులు తీసుకున్నా దక్షిణాదిన ఏ మాత్రం ఫామ్ కోల్పోని హీరోయిన్ సమంత. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమానే ‘ఖుషి’. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మైత్రీ మూవీస్ సంస్థ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా…
అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో సగానికి సగం మంచి హీరోలే.. అక్కినేని నటవారసులే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు హీరోలు లైన్ లో వున్నారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్. వీళ్లల్లో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తమ సత్తాని చాటుతున్నారు. ఇక వీరందరూ ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఒక్కటిగా కలవడం, ఆ ఫొటోస్ వైరల్ గా మారడం జరుగుతూ ఉంటాయి. తాజాగా అక్కినేని హీరోలు అందరు…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అందాల తార సమంత కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పేరును ప్రకటిస్తూ.. మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విజయ్-సమంత నటిస్తున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరును ఖరారు చేశారు చిత్రయూనిట్. ఒక ఎపిక్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల…
టాలీవుడ్ అడోరబుల్ కపుల్ నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు అన్యోన్యంగా ఉండి విడిపోవడం అభిమానులకు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మళ్లీ ఈ జంట కలిస్తే బావుండు అని ఇప్పటికి ఎంతోమంది ఆశపడుతున్నారు. ఇక ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయా..? అంటే ఏమో జరగొచ్చు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఈ జంట విడిపోయాక ఒక్కసారి కూడా కలిసింది లేదు.. ఒకరి బర్త్ డే…
టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిన నందిని ప్రస్తుతం పలు సినిమాలు చేసున్న విషయం విదితమే. ఇక నందిని రెడ్డి కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా ఓ బేబీ. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన విషయం విదితమే.. అప్పటినుంచే సామ్, నందిని రెడ్డిల పరిచయం స్నేహంగా మారింది.…