Samantha: మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ గడించిన కథానాయికల్లో సమంత ఒకరు. అయితే, ఆమె ఈ స్థాయికి అంత ఈజీగా చేరుకోలేదు. ఎన్నో కష్టాలు, సవాళ్ళను ఎదుర్కొని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగానూ ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. జెస్సీ (ఏం మాయ చేశావే)గా యువత మనసు దోచిన ఈ భామ.. ఆ తర్వాత నటన పరంగా ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. అందంతో నెట్టుకొస్తోందే తప్ప, యాక్టింగ్ రాదంటూ ఎందరో పెదవి విరిచారు. అలాంటి వాళ్ళందరి నోళ్ళు మూయించేలా తన ప్రతిభ చాటి, ఇప్పుడు జాతీయ స్థాయిలోనే తన సత్తా చాటుతోంది.
ముఖ్యంగా.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సమంత ఫుల్ బిజీ అయిపోయింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సమంత.. ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. మరో పాన్ ఇండియా సినిమాకు సంతకం చేసిందట! డెబ్యూ డైరెక్టర్ చెప్పిన కథతో ఇంప్రెస్ అవ్వడంతో, ఈ సినిమా చేసేందుకు సమంత పచ్చజెండా ఊపిందని సమాచారం. అయితే.. దర్శకుడితో పాటు ఇతర నటీనట & సాంకేతిక బృందం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట!
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ఇదిలావుండగా.. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసిన వెంటనే, విడుదలకు సిద్ధం కానున్నాయి. మరోవైపు.. మరో వెబ్‌సిరీస్‌కు అమెజాన్ ప్రైమ్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!