సౌత్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ బంధాన్ని నాలుగేళ్లు కన్నా ఎక్కువ నిలుపుకోలేకపోయింది. కొన్ని విబేధాల వలన ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ విడాకుల తరువాత సామ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ బోల్డ్ గా నటించడం వలనే చై- సామ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని కొందరు, అక్కినేని ఫ్యామిలీ, సమంతను వేధించిందని మరికొందరు రకరకాల పుకార్లను పుట్టుకొచ్చాయి. ఇక ఇందులో నిజం ఎంత అనేది ఎవరికి తెలియదు.. అయితే విడాకుల తరువాత చై- సామ్ తమ కెరీర్ లను సెట్ చేసుకోవడంలో మునిగిపోయారు. ప్రస్తుతం సామ్ పాన్ ఇండియా మూవీలలో నటిస్తుండగా.. చై ఇప్పుడిప్పుడే వరుస సినిమాలను లైన్లో పెట్టి పాన్ ఇండియా హీరోగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో మాత్రం సామ్, అక్కినేని ఫ్యామిలీపై ఒక మెట్టు పైనే ఉందని చెప్పాలి.
నిజం చెప్పాలంటే ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే పాన్ ఇండియా వైపు వెళ్ళలేదు. మిగతా ఆ హీరోలందరూ అన్ని భాషల్లో తమ రేంజ్ ను పెంచుకోవడానికి కష్టపడుతుంటే.. అక్కినేని హీరోలు మాత్రం ఇంకా నిదానాన్ని పాటిస్తున్నారు. గత కొన్నిరోజులుగా నాగ్ సినిమాలపై ఫోకస్ పెట్టడం లేదన్న మాట నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. అయితే అందుకు కారణం కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడని టాక్.. ఇక అఖిల్ విషయానికొస్తే.. అయ్యగారు మూడు సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకొని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ కొట్టి గట్టెక్కాడు.. ఇక ఈ సినిమా తరువాత ఏజెంట్ సినిమాను పట్టాలెక్కించాడు.. ఇక ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం.. ఇక చై..మాత్రం నిదానమే ప్రధానం అంటూ కెరీర్ ను ఎంతో బ్యాలెన్స్డ్ గా సెట్ చేసుకుంటున్నాడు.. కొత్త కొత్త ప్రయోగాలను, డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో హిందీలోకి అడుగుపెడుతున్నాడు.
ఇక ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కడంతో చై మొదటి పాన్ ఇండియా మూవీ ఇదేనని చెప్పొచ్చు. ఇక ఈ అక్కినేని హీరోలతో పోలిస్తే.. వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఒక స్టెప్ ముందే ఉంది సామ్.. ప్రస్తుతం అమ్మడు ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాల్లో నటిస్తోంది.. ఇక ఇవి కాకుండా బాలీవుడ్ లో రెండు ప్రాజెక్టులు, హాలీవుడ్ ప్రాజెక్ట్ ఒకటి.. ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీ గా మారిపోయింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఒకటి ఉంది అంటున్నారు నెటిజన్లు.. పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకోవడం ముఖ్యం కాదు.. దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం.. ఇప్పుడున్న పరిస్థితిల్లో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు అని, అయినా వీరి మధ్య ఇలాంటి గొడవలు ఎందుకు పెడుతున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.