అల్లు అర్జున్- సుకుమార్ కాంబో లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కెరీర్ లోనే రికార్డు కలెక్షన్లను సాధించి చరిత్ర సృష్టించింది. బన్నీ నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తన సత్తా చాటడమే కాకుండా హిందీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ గా సమంత ఐటెం సాంగ్ నిలిచింది. ఇక సినిమా సక్సెస్ విషయంలో అల్లు అర్జున్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిందే . అతని ఆహార్యం , నటన సినిమాకే హైలైట్ గా నిలిచాయి. వన్ మ్యాన్ షో గా సినిమా మొత్తం బన్నీ తన ఆటిట్యూడ్ తో అదరగొట్టేశాడు. సినిమా చుసిన ఎవరైనా బన్నీ నటనకు ఫిదా కావాల్సిందే. అయితే ఒక స్టార్ నటుడు మాత్రం ఈ సినిమా సమంత వలనే హిట్ అయ్యింది అని అనడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ నటుడు ఎవరంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు భాను చందర్.. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రస్తుతం ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన పుష్ప సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
బాలీవుడ్‌ను టాలీవుడ్ ఓవర్ చేస్తుందని అందరు అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి అన్న ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ ” అది నేను కూడా ఒప్పుకుంటాను.. ఇప్పుడు వస్తున్న సౌత్ సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతున్న విషయం తెలిసిందే కదా.. అంతెందుకు మొన్నామధ్య రిలీజ్ అయినా పుష్ప ఎంతటి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమా ఆ ఒక్క పాట వల్లే పెద్ద హిట్ అయ్యింది. అదే ఊ అంటావా మావ.. ఊఊ ఉంటావా సాంగ్. సమంత నటించిన ఈ పాట తమిళం, మళయాళంలో కూడా మారుమోగింది” అని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అంటే సమంత వలనే ఈ సినిమా హిట్ అయ్యిందని చెప్తున్నారా..? సినిమా లో సమంత ఉన్నా లేకపోయినా ఈ సినిమా హిట్ అయ్యేది. బన్నీ కోసం ఈ సినిమాను చూడడానికి వచ్చేవారు. సమంత ప్లేస్ లో ఏ హీరోయిన్ ఉన్నా కూడా ఆ సాంగ్ అంతే హాట్ అయ్యేది అని బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఐటెం సాంగ్ వలన సినిమా హిట్ అయ్యిందని చెప్పడం పద్దతి కాదు అని, ఆ సాంగ్ వలన సినిమా ఎక్కువ పేరు సంపాదించుకొంది అని చెప్పొచ్చు కానీ దానివలన మాత్రమే విజయం అందుకుంది అని చెప్పకూడదు.. ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి.. మరి అవన్నీ ఎందుకు హిట్ కాలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.