అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో సగానికి సగం మంచి హీరోలే.. అక్కినేని నటవారసులే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు హీరోలు లైన్ లో వున్నారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్. వీళ్లల్లో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తమ సత్తాని చాటుతున్నారు. ఇక వీరందరూ ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఒక్కటిగా కలవడం, ఆ ఫొటోస్ వైరల్ గా మారడం జరుగుతూ ఉంటాయి. తాజాగా అక్కినేని హీరోలు అందరు ఒకే ఫ్రేమ్ లో కనిపించి కనువిందు చేశారు. ఈ ఫోటోను హీరో సుశాంత్ అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఇందులో ఒక్కరు తగ్గారు.. అతడే అక్కినేని సిసింద్రీ అఖిల్.. ప్రస్తుతం అఖిల్ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న విషయం విదితమే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తో హిట్ అందుకున్న అఖిల్.. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమాను చేస్తున్నాడు.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇటీవలే కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో అయ్యగారు వెకేషన్ ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు చెక్కేశాడు. దీంతో ఈ ఫ్రేమ్ లో అఖిల్ మిస్ అయ్యాడు. ఇక ఈ ఫొటోలో మిస్ అయిన మరోకరు సమంత.. చై తో కలిసి ఉన్నప్పుడు అన్ని ఫ్యామిలీ ఫొటోస్ లో సామ్ డామినేషన్ కనిపించేది. ఆమె ఉంటే ఆ ఫొటోకే కళ వచ్చేది. ఇక చై తో విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్న విషయం విదితమే. ఇక దీంతో ఈ ఫొటోలో వదినా మరిది తప్ప అక్కినేని ఫ్యామిలీ మొత్తం కనిపించి కనువిందుచేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.