Samantha: అదే జరిగితే ఆనందంగా చచ్చిపోతా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. సామ్, భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్న విషయం విదితమే .. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు పెట్స్ అంటే పంచప్రాణాలు. తన దగ్గర ఉన్న కుక్క పిల్లలు హ్యాష్, సాష్ లతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. వాటికి ఏమైనా అయినా అల్లాడిపోతోంది. వాటిని బిడ్డలు కంటే ఎక్కువగా పెంచుకుంటుంది సామ్.. ఇక తాజాగా సామ్ తన సోషల్ మీడియాలో హ్యాష్, సాష్ లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
మరికొంతమంది మనుషులను వదిలేసి కుక్కలతోనే ఉండిపో అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఒక నెటిజన్ మాత్రం “నువ్వు పెట్స్ కుక్కలు, పిల్లులతో ఒంటరిగా చచ్చిపోవాలి” అని రాసుకొచ్చాడు. ఇక ఆ వ్యక్తికి సామ్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చింది. “అదే జరిగితే నన్ను నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో సదురు నెటిజన్ వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేసి సిగ్గుతో తలదించుకున్నాడు. ప్రేమను పంచేవారు జంతువులు అయితే మాత్రం ఏమైంది.. జంతు ప్రేమికులకు అవి పెట్స్ కాదు బిడ్డలు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎలాగో అవి కూడా అంతే.. ఇలా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదా..అదే జరిగితే ఆనందంగా చచ్చిపోతా అని సామ్ అనడం ఆమె పెట్స్ పై ఎంత ప్రేమను పెట్టుకుందో అర్ధం అవుతుంది.. అందరు ఒకేలా ఉండరు అని సామ్ అభిమానులు ట్రోలర్స్ పై విరుచుకు పడుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!