సౌత్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్ మొత్తం స్నేహితులే.. వారు, వీరు అని లేకుండా అందరితో సామ్ ఎంతో సన్నిహితంగా ఉంటోంది. ఇక సామ్ స్నేహితులు ఎంతమంది ఉన్నా ఆమె బెస్ట్ ఎవరు అంటే తక్కువ శిల్పారెడ్డి పేరు చెప్పేస్తారు. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. కష్టనష్టాల్లో ఉన్నవారికి ఒక ఫ్రెండ్ ఇచ్చే ఓదార్పు మాటలో చెప్పలేనిది. తన కుటుంబంలో ఒకరిగా చూసుకొనే స్నేహితులు చాలా అరుదు. అలాంటివారిలో సామ్ కి దొరికిన స్నేహితురాలు శిల్పా.. చైతన్యతో విడిపోయాక బాధలో ఉన్నప్పుడు, ఆమెను డిప్రెషన్ నుంచి కాపాడింది ఆమె అని సమంతనే ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.
సామ్ తో కలిసి ఫంక్షన్ లు, వెకేషన్ లకు తిరుగుతూ ఉండే శిల్ప ఒక మోడల్ అన్న విషయం విదితమే. ఆమె దగ్గరే సామ్ కూడా ఫిట్ నెస్ నేర్చుకున్నది అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా శిల్పా తన ఫిట్ నెస్ బాడీని అభిమానులకు చూపించింది. బ్యూటీ అండ్ బోల్డ్ పేరుతో తన బికినీ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేసింది. పింక్ కలర్ బికినీ లో శిల్పా ఆబ్స్ ఎంతోమంది హీరోయిన్లను సైతం కన్నుకొట్టుకొనేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్ నెచ్చెలి ఘాటు అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. వావ్, సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.