Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్ చేయాలని పలువురు రెజ్లర్లు గత కొంత కాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు.
రెజ్లర్ల నిరసనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ నిరసన నుంచి తాను కాని, వినేష్ ఫోగట్ కాని, బజరంగ్ పూనియా కాని తప్పుకోవడం లేదని సాక్షి మాలిక్ సోమవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాము ముగ్గురం రెజ్లర్ల నిరసన నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాము తమ ఉద్యోగాలలో తిరిగి చేరామే తప్ప నిరసన నుంచి ఉపసంహరించుకోలేదన్నారు సాక్షి మాలిక్.
Wrestlers Protest: భారత రెజ్లర్ సమాఖ్య( డబ్ల్యూఎఫ్)చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
Wrestlers Protest: భారత రెజ్లర్ల సమాఖ్య(WFI) చీఫ్, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో వెంటనే అరెస్ట్ చేయడంతో పాటు పదవి నుంచి తొలగించాలని రె
మైనర్‌తో సహా పలువురు మహిళా రెజ్లర్‌లను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో బీజేపీ ఎంపీ, దేశ రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈరోజు తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామని చెప్పారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ మల్లయోధులు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతలకు దారితీసింది. జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మల్లయోధులు, వివిధ రాష్ట్రాల ఖాప్ పంచాయతీలు, రైతులు ఆదివారం పార్లమెంటు భవనం సమీపంలో 'మహిళా సమ్మన్ మహాపంచాయత్'కు పిలుపునిచ్చారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు వచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై నిరసనలో అగ్రశ్రేణి రెజ్లర్‌లతో చేరిన రైతులు ఆదివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
Wrestlers protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్నారు. మహిళా క్రీడాకారిణులపై బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ లైంగిక వేధిపులకు పాల్పడినట్లు రెబర్లు ఆరోపిస్తున్నారు. అతడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలో అగ్రశ్రేణి క్రీడాకారులు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) చీఫ్ పీటీ ఉష ఇవాళ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజ్లర్లను కలిశారు. మాజీ ఒలింపియన్ అయిన పీటీ ఉష అక్కడ గుమిగూడిన మీడియాతో మాట్లాడకుండా నిరసన స్థలం నుంచి వెళ్లిపోయారు.