Bajrang Punia: బ్రిజ్‌భూషణ్ 15 రూపాయల వ్యాఖ్యలపై పూనియా స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bajrang Punia And Sakshi Malik Gives Strong Counter To Brij Bhushan: భారత రెజ్లర్లు సాధించిన పథకాలను వెలకడుతూ భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ రెజ్లర్లు సాధించిన పథకాలు కనీసం రూ.15 కూడా విలువ చేయవని.. వాళ్లు తమ పథకాల్ని కాకుండా, కోట్లలో పొందిన ప్రోత్సాహకాల్ని తిరిగి ఇవ్వాలని ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై రెజ్లర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తామెంతో కష్టపడి సాధించిన పథకాలపై ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారా? అంటూ బ్రిజ్‌భూషణ్‌పై మండిపడుతున్నారు. తాజాగా ఒలింపిక్ మెడలిస్ట్ బజ్రంగ్ పూనియా సైతం ఆయనపై ధ్వజమెత్తాడు. ఆ మెడల్‌ని బ్రిజ్‌భూసణ్ తమకు భిక్షంగా ఇవ్వలేదంటూ కౌంటర్ వేశాడు.
Peedika Rajanna Dora: చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆగ్రహం
Also Read
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
‘‘ఈ మనిషి (బ్రిజ్‌భూషణ్‌ను ఉద్దేశిస్తూ) ఏ పథకాలకైతే రూ.15 వెలకట్టాడో, దాని వెనకాల మా 15 సంవత్సరాల కష్టం ఉంది. నీలాంటి మనుషులు మాకు ఆ పథకాలను భిక్షంగా ఇవ్వలేదు. రాత్రనక పగలనక చెమటోడ్చి, మా రక్తం ధారపోసి, దేశం కోసం కోసం గెలిచిన పథకాలవి. ఆడవాళ్లను ఆటబొమ్మల్లా కాకుండా, ఆటగాళ్లను మనుషులుగా భావించి ఉంటే.. అతని నోటి నుంచి ఇలాంటి దిగజారుడు మాట వచ్చేది కాదు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా బజ్రంగ్ పూనియా విరుచుకుపడ్డాడు. అలాగే తన ట్వీట్‌కి బ్రిజ్‌భూషణ్ వ్యాఖ్యానించిన వీడియోని సైతం షేర్ చేశాడు. పూనియాతో పాటు మరో రెజ్లర్ సాక్షి మలిక్ కూడా అంతేస్థాయిలో ధ్వజమెత్తింది. బ్రిజ్‌భూషణ్‌కు కనపడిన 15 రూపాయల పతకం కోసమే సర్వస్వాన్ని ధారపోశామని.. అతని వ్యాఖ్యలు సిగ్గుచేటని, క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించాలని సూచించింది.
Icecream : ఆ ఐస్‌క్రీమ్ తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే
ఇదిలావుండగా.. బ్రిజ్‌భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అతనికి వ్యతిరేకంగా భారత రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అతనిపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేసి జైల్లో వేయాలని నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు బ్రిజ్‌భూషణ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ఆదేశాల మేరకు ఆయనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఒక ప్రత్యేక కమిటీ ఈ కేసుని విచారిస్తోంది.
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!