‘‘ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్’’ వర్కింగ్ ఛైర్మన్‌గా బజరంగ్ పునియాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇద్దరి చేరికతో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ఆ పార్టీ అదినాయకత్వం భావిస్తోంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెజ్లర్ వినేష్ ఫోగట్ కాంగ్రెస్ లో చేరింది. వినేష్ ఫోగట్ జులనా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనుండగా, బజరంగ్ పునియా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరింగ్ పునియా చేరారు. హర్యానాలో వచ్చే నెల తొలివారంలో ఎన్నికలు జరగబోతున్నాయి.
Brij Bhushan Sharan Singh: రెజ్లింగ్ బాడీ చీఫ్‌గా ఉన్న సమయంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ బ్రిజ్ భూషన్ శరన్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని భారత ఏస్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ వంటి వారు ఆందోళనలు చేశారు.
Wrestlers Protest: వందలాది మంది జూనియర్ రెజ్లర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. తమ కెరీర్‌లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయామని రెజ్లర్లు నిరసనకు పిలుపునిచ్చారు. అయితే ఈ సారి మాత్రం వారంతా ప్రముఖ రెజ్లర్లు అయిన వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లకు వ్యతిరేకంగా గళం విప్పారు. వారికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో రెజ్లింగ్ సంక్షోభం కొత్త టర్న్ తీసుకుంది.
Wrestlers Protest: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. అయితే ఈ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రెజ్లర్ సాక్షిమాలిక్, తన భర్త సత్యవర్త్ కడియన్ తో కలిసి మాట్లాడుతూ.. ఈ కేసులో మైనర్ రెజ్లర్ బాలిక తండ్రికి బెదిరింపులు రావడంతోనే భయపడి తన స్టేట్మెంట్ ను మార్చుకున్నారని ఆరోపించారు.
గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే నిరసన చేస్తున్న వారిలో ఓ మైనర్ తన వాంగ్మూలాన్ని మార్చుకుంది. అందుకు సంబంధించి సాక్షి మాలిక్ ఒక వీడియో స్టేట్‌మెంట్ ద్వారా తెలిపింది. మైనర్ కుటుంబాన్ని బెదిరించారని అందుకే ఆమె తన స్టేట్‌మెంట్‌ను మార్చుకున్నట్లు పేర్కొంది.