తెలంగాణలో వైఎస్ షర్మిల అరెస్ట్, ఆందోళనలపై స్పందించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనకు.. షర్మిల్ అరెస్ట్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి.. ఆయన స్పందిస్తూ.. షర్మిల అరెస్ట్ బాధాకరం అన్నారు.. మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి ఆమె.. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధకలిగించిందన్నారు.. అయితే, ఆమె పార్టీ విధానాలకు సంబంధించి మీరు ప్రశ్నించటం.. మేం మాట్లాడటం…
Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని.. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని సజ్జల చెప్పారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు.. పోలీసులు, వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.. అయితే, చంద్రబాబుపై ఫైర్ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు అందరూ చూశారన్న ఆయన.. ముఖ్యమంత్రి, పార్టీ నేతల మీద చివరకు ప్రజల మీద కూడా బూతులతో దాడి చేశారని విమర్శించారు.. చంద్రబాబుకు ఎందుకు అంత కోపం వచ్చింది? అని ప్రశ్నించిన ఆయన..…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇప్పటం విషయంలో పవన్ కళ్యాణ్ కు ఎందుకు అంత ఆవేశం వచ్చిందో అర్థం కాలేదన్న ఎద్దేవా చేసిన ఆయన.. సభకు స్థలం ఇచ్చిన ఒక్కరి ఇల్లు కూడా పోలేదు.. ప్రభావం పడే అవకాశం ఉన్న ఒక వ్యక్తి కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాడన్నారు.. కానీ, దీనికి పవన్ హైవే పై చేసిన డ్రామా అందరూ చూశారు.. తర్వాత…
R Krishnnaiah: విజయవాడలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల పాటు బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. కానీ ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కానీ ఏపీ సీఎం జగన్ బీసీ కాకపోయినా బీసీల పక్షపాతిగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. అందుకే సీఎం జగన్‌ను సంఘ సంస్కర్తగా పరిగణించాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించిన నాయకుడు వైఎస్…
Sajjala Ramakrishna Reddy: వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు అభ్యంతరాలు దాటి ఈ ఏడాదిలోనే విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వైజాగ్ నుండి పరిపాలన ప్రారంభిస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారని.. ఇప్పుడు ఎన్నికలు…
చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉంటాయి.. ఆయనకు ప్రజలు ఓటు బ్యాంకు మాత్రమే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసం చౌకబారు ఎత్తుగడలు వేయదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.