మాచర్లలో జరిగిన ఘర్షణపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు.. అయితే, చంద్రబాబు నిజస్వరూపం మాచర్లలో బయటపడిందని మండిపడ్డారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయనే.. 7 హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న బ్రహ్మా రెడ్డిని చంద్రబాబు ఎందుకు మాచర్లలో తెచ్చిపెట్టారు? అని ప్రశ్నించారు. మాచర్లలో దాడులను చంద్రబాబు రెచ్చగొట్టి చేయించారని ఆరోపించారు.. పిన్నెల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజకీయంగా…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం కౌంటర్ ఎటాక్ దిగుతోంది.. పవన్ కళ్యాణ్ గతంలో కూడా వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాను అన్నారు.. ఏం జరిగిందో రాష్ట్రం చూసింది అంటూ సెటైర్లు వేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్నికల ఫలితాలను ప్రజలు నిర్ణయిస్తారు అన్న స్పృహ పవన్ కల్యాణ్‌కు లేదని ఎద్దేవా చేసిన ఆయనే.. వైఎస్ జగన్ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూసేది పవన్, చంద్రబాబు…
గడప గడపకు కార్యక్రమం అంటే ప్రజల దగ్గరకు వెళ్లడమేనని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మూడేళ్లలో ఆయా కుటుంబాల్లో వచ్చిన మార్పులు వివరించడం కోసమే గడప గడపకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
పొత్తులు.. ఎత్తులు.. లాంటి చచ్చు ఆలోచనలు మాకు లేవు అని స్పష్టం చేస్తూనే.. టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు వేశారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఎప్పుడూ ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. పార్టీలో ఊపులేక చంద్రబాబు ముందస్తు మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.. ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేసిన ఆయన.. హామీలు అమలు చేసి ఐదేళ్లు పూర్తి అయ్యాక ప్రజలకు చెప్పి ఎన్నికలకు…