ఏళ్లు గడుస్తున్నా విభజన హామీలు అమలు కావడం లేదు.. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులను, అధికారులను తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు.. అధికారులు వివిధ సందర్భాల్లో కలిసి విజ్ఞప్తి చేస్తున్నా.. అమలుకు నోచుకోవడం లేదు.. అయితే, ఈ వ్యవహారంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… మేం కేంద్రంపై ఒత్తిడి మాత్రమే చేయగలం అని వ్యాఖ్యానించారు.. విభజన చట్టంలోని చాలా హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన..…
Sajjala Ramakrishna Reddy comments on chandrababu: వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటనపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. అంటూ ప్రచారం కోసమే చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారని ఎద్దేవా చేశారు. పరామర్శ కంటే ప్రచారానికే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని.. చంద్రబాబు మురికి రాజకీయానికి గురువారం నాటి ఘటనే సాక్ష్యమన్నారు. చంద్రబాబు దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు హయాంలో ప్రకృతి…
Sajjala Ramakrishna Reddy comments on polavaram Height:పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని సజ్జల గుర్తుచేశారు. పోలవరం ఎత్తుపై తెలంగాణ వాదన అసంబద్ధంగా ఉందన్నారు. భద్రాచలానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రత్యేక ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే డిజైన్లు ఖరారు చేశారని సజ్జల తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ…
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తున్నట్లు వైసీపీ బహిరంగంగానే ప్రకటించింది. అయితే ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ మాత్రం తమ వైఖరిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ వైఖరిని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తమకు ఎర్రకోట మీద జెండా ఎగరేయాలని, ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉన్నాయని తెలిపారు.…
ఏపీ ప్రభుత్వంలో నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం సలహాదారుడు ఎం.శామ్యూల్ (రిటైర్డ్ ఐఏఎస్), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్) పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీళ్లంతా మరో ఏడాది పాటు సలహాదారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా 2019లో జగన్…
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మూడు ఆప్షన్‌లపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. రాజకీయాల్లో సీరియస్‌గా ఉన్నవాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తారని.. కానీ విశ్లేషకుడిగా పవన్ కళ్యాణ్ ఆప్షన్లు మాత్రమే చెప్పారని సజ్జల ఆరోపించారు. జనసేన తన పార్టీ అని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్లు ఉన్నారని సజ్జల చురకలు అంటించారు. బీజేపీ వస్తుందో లేదో కానీ టీడీపీతో వెళ్ళటం ఖాయమని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం అవుతోందన్నారు. చంద్రబాబు గేమ్…
అమరావతి: ప్రతిపక్ష పార్టీ టీడీపీపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు నుంచి టీడీపీ నేతలకు కడుపు మంట ఎక్కువైందని ఆయన ఎద్దేవా చేశారు. మహానాడు ఘన విజయం అంటూ వాళ్ళకి వాళ్లే బుజాలు చరుచుకుంటున్నారని చురకలు అంటించారు. టీడీపీ నేతలు ఎంతటి పతనావస్థలో ఉన్నారనేది వారి ఏడుపు వల్లే కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు. ఏడుపు వాళ్ళ అధికారిక గీతం అయ్యిందని.. అసెంబ్లీ నుంచి చంద్రబాబు ఏడుపు ప్రారంభమైందని…
చింతమనేని ప్రభాకర్. దెందులూరు మాజీ ఎమ్మెల్యే. ప్రభాకర్ ఎక్కడుంటే అక్కడ వివాదం అన్నట్టు రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన దూకుడే ఆ ప్రచారాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం అధికార బలం లేకపోయినా అనుచరగణం వెంటే ఉంది. ఈ క్రమంలో చేసిన పనుల వల్ల వరసగా కేసుల్లో కూరుకుపోయారు చింతమనేని. అధికారంలో ఉన్నప్పుడు.. గత ఎన్నికల టైమ్లో వైసీపీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ రాజకీయంగా కాకరేపుతున్నాయి. కేసులంటే భయపడని చింతమనేని.. తాజాగా కొత్తదారి ఎంచుకోవడంతో చర్చగా…