Sajjala Ramakrishna Reddy: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం ప్రారంభించాం.. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు.. వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన పోస్టర్ల ఆవిష్కరణ,…
Sajjala Ramakrishna Reddy: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వానికి అర్థమే మారిపోయింది అని ఆరోపించారు వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజల ఆకాంక్షల మేరకు ఏ ప్రభుత్వాలు అయినా పనిచేస్తాయి.. మానిఫెస్టోలు అమలు చేయటంతో పాటు వ్యవస్థలకు అనుగుణంగా పనిచేయాలి.. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవస్థలను గాలికి వదిలేసింది.. ప్రభుత్వమే నేరస్వభావం కలిగి ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు…
Sajjala Ramakrishna Reddy: నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయామనే భయం చంద్రబాబుకు పట్టుకుందని వ్యాఖ్యానించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం జరిగింది.. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, పలువురు ఇతర నాయకులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. వైసీపీకి 18 నుంచి 20 లక్షల మంది క్రియాశీల క్షేత్రస్ధాయి నాయకత్వం ఉంది..…
అమరావతిపై వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని పెడితే ఖర్చు తక్కువ అవుతుందన్నారు.. అయితే, ఇంతకు ముందు అమరావతిని రాజధానిగా తీసేస్తామని మేం అనలేదన్నారు.. అమరావతిని కలుపుకొని ఢీసెంట్రలైజ్ అన్నాం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అన్నాం.. మూడు రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారన్నారు..
ప్రతిపక్షం అనేది మనకు ఒక మంచి అవకాశం, వెనకబడిన కులాలు అందరినీ చైతన్యపరిచి, జగన్ వల్ల మనకు భవిష్యత్ ఉంటుందనే చైతన్యం అందరిలో తీసుకురావాలి, ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి, ఇక ఏ మాత్రం జాప్యం తగదు. జగన్ ఆలోచనలు, విధానాలను మీమీ బీసీ కులాల్లోకి మరింతగా తీసుకెళ్ళాలి. అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఐదేళ్ళలో మనం ప్రజలకు చేసిన మంచి ఎక్కడికీ పోలేదు, అందరికీ అర్థమవుతోందన్నారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.
వైఎస్ జగన్ అసెంబ్లీ హాజరుపై సీఎం చంద్రబాబు విసిరిన సవాల్ ఏడ్చినట్లుగా ఉంది అంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.. చంద్రబాబుకి దమ్ము, ధైర్యం ఉంటే జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఛాలెంజ్ చేశారు.. అసలు, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..? అని ప్రశ్నించారు..
పులివెందుల చరిత్రలో వైసీపీ ఓడిపోలేదు.. జడ్పీటీసీ ఉప ఎన్నికలపై న్యాయ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ..
ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగనేనా? జగన్ను అరెస్ట్ చేస్తారా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, వైఎస్ జగన్ను ఎదుర్కొనే సత్తా చంద్రబాబుకు లేదన్న ఆయన.. గత ఎన్నికల్లో.. పవన్ కల్యాణ్, బీజేపీ సహకారంతోనే జగన్పై విజయం సాధించారు తప్ప.. అంతకంటే ఏమీ లేదన్నారు.. అయితే, జగన్ను జైలుకు పంపితే.. చంద్రబాబు కడుపుమంట ఏమైనా తగ్గుతుందేమో అని వ్యాఖ్యానించారు సజ్జల..
లిక్కర్ అమ్మకానికి చంద్రబాబే రాచమార్గం వేశారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యక్తులతో మద్యం అమ్మకాలు.. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు చేస్తూ.. లిక్కర్ అమ్మకాలకు రాచమార్గం వేసిందే చంద్రబాబు అని విమర్శించారు.