Sajjala Ramakrishna: కేసీఆర్ వ్యాఖ్యలపై సజ్జల రియాక్షన్.. సంబంధం లేదని తేల్చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sajjala Ramakrishna Reddy Reacts To CM KCR Comments: తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. అసలు తెలంగాణ రాజకీయాలకు, ఏపీ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు. బహుశా తెలంగాణ రాజకీయ పరిస్థితుల కోణంలో కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చేమో గానీ.. ఏపీలో మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేదన్నారు. అభివృద్ధి అజెండాతో మాత్రమే వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని, ఇతర రాష్ట్రాల వ్యవహారాల గురించి తాము పట్టించుకోబోమని వెల్లడించారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలు వారి రాష్ట్రానికే పరిమితమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సీఎం జగన్‌కు ఆసక్తి లేదన్నారు. ఏపీ ప్రజలు తమకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారని.. ఈ ఐదేళ్ల కాలంలో శక్తిమేర పనిచేసి, ప్రజా దీవెనలు కోరతామన్నారు. ముందస్తు ఎన్నికలు రావొచ్చని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, ఇది కేవలం రాజకీయ ఎత్తుగడేనని స్పష్టం చేశారు.
ఇక ఇదే సమయంలో.. తనకు చివరి ఎన్నికలు ఇవేనంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సజ్జల మరోసారి ధ్వజమెత్తారు. తనకు చివరి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ప్రజలను కోరుతున్నారని.. కానీ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుదరవని తేల్చి చెప్పారు. నాయకుడుగా ఆయన తమకు ఎంతవరకు పనికొస్తాడన్నది ప్రజలు ఆలోచిస్తారని, చంద్రబాబు ఏడ్చినంత మాత్రాన ఆయనపై జాలి చూపడమనేది ఉండదన్నారు. అంతకుముందు.. దింపుడు కళ్లెం ఆశలా ప్రజల్ని చంద్రబాబు తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, ఏడుపులు, పెడబొబ్బలకు విలువ ఉండదన్నారు. ఒకటికి పదిసార్లు తన భార్య పేరుని ప్రజల్లో చెప్పి, చంద్రబాబే ఆమెను అవమానిస్తున్నారని.. బహుశా చంద్రబాబు ప్రవర్తనకు ఆమె కూడా కుమిలిపోతూ ఉంటారేమోనని సందేహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటల్లో.. అధికారం నా హక్కు అన్న ధోరణితో పాటు పొగరు కనిపిస్తోందన్నారు. ఎవరైనా చంద్రబాబు భార్యను అవమానిస్తే.. ప్రజలు ఎందుకు ఆయనకు ఓట్లు వేయాలి? అని ప్రశ్నించారు.
Also Read
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..