UNICEF: పిల్లలపై వలస సంక్షోభం.. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా పిల్లల సంక్షోభానికి గురువుతున్నారు. అనేక కారణాల వల్ల పిల్లల వలసలకు గురువుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇప్పుడే పిల్లల వలస పెరిగిందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) శుక్రవారం వెల్లడించింది. అనేక కారణాల వల్ల సొంత ప్రాంతాలను వదిలి ఇతర దేశాలకు పిల్లలు శరణార్థులుగా వెళ్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 36.5 మిలియన్ల పిల్లలు 2021 చివరి నాటికి ఘర్షణ, హింస ఇతర సంక్షోభాల కారణంగా సొంత ప్రాంతాలను వదిలి వెళ్లారు. దాదాపుగా 22.8 మిలియన్ల మంది అంతర్గత సంక్షోభం, హింస కారణంగా వలస వెళ్లారు. దీంతో పాటు వాతావరణం, పర్యావరణ పరిణామాలు, విపత్తుల కారణంగా పిల్లలు వరస సంక్షోభాన్ని ఎదుర్కొంటూ శరణార్థులుగా మారుతున్నాయి. తాజాగా 2022లో ఉక్రెయిన్- రష్యా పరిణామాలు కూడా పిల్లల వలసలకు కారణం అయింది. అయితే ఇది యూనిసెఫ్ నివేదికలో చేర్చ లేదు.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ఆఫ్ఘనిస్తాన్ తీవ్రమైన హింస, దీర్ఘకాలిక సంఘర్షణ, రాజకీయ అస్థిరత కారణంగా చాలా మంది పిల్లలు మైగ్రేట్ అవుతున్నారు. సరిహద్దుల్లోని పాకిస్తాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్ వంటి దేశాలు శరణార్థి సంక్షోభానికి ప్రభావితం అవుతున్నాయి. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యెమెన్ వంటి దేశాల్లో వాతావరణ మార్పులు, తీవ్రవాదం, విధ్వంసక పరిణామాలు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. శరణార్థి పిల్లల్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రక్షణ వంటి సేవలు అవసరం అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ అన్నారు. పిల్లలు వలస వెళ్లకుండా విద్య, రక్షణ ఇతర సేవలు అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనాథలైన పిల్లలు అక్రమ రవాణా, దోపిడి, హింసకు గురయ్యే ప్రమాదం ఉందని.. ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణాలో 28 శాతం పిల్లలే ఉంటున్నారని నివేదిక తెలిపింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..