Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షం.. లీసీచాన్స్క్‌పై పట్టుకు యత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు రెండు నెలలుగా ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న రష్యా.. అనూహ్యంగా ఇతర ప్రాంతాలపై విరుచుకుపడింది. ఒక్క రోజు వ్యవధిలోని 50కి పైగా రాకెట్లను పుతిన్ సేనలు సంధించాయి. తూర్పు ఉక్రెయిన్‌లోని లీసీచాన్స్క్‌పై పట్టు సాధించడానికి రష్యా బలగాలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. దీనికి సమీపంలోని సీవీరోదొనెట్స్క్‌పై కొన్ని వారాలుగా అప్రతిహతంగా దాడులు కొనసాగించిన తర్వాత అక్కడి నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగే పరిస్థితిని తీసుకురాగలగడంతో పుతిన్ సేనలు ఈ నగరం దిశగా వెళ్తున్నాయి. లీసీచాన్స్క్‌తో సంబంధాల్లేకుండా చేయాలని రష్యా చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఉక్రెయిన్ సైన్యం వెనుదిరగడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తూర్పు ప్రాంతాలకు చాలా దూరంగా ఉన్న నగరాలపైనా క్షిపణి దాడుల్ని రష్యా మొదలుపెట్టింది. దక్షిణం వైపు నుంచి తమను దిగ్బంధించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని లుహాన్స్క్ ప్రాంత గవర్నర్ సెర్హీ హైదై తెలిపారు.
తాజాగా నల్ల సముద్రం నుంచి పశ్చిమాన ల్వీవ్ రీజియన్‌లో ఉన్న యారోవ్ మిలటరీ బేస్‌పై రష్యా క్షిపణులను వదిలింది. ఇక్కడ ఉక్రెయిన్ ఫైటర్లతో పాటు విదేశాల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన సైనికులూ ఉన్నారు. మార్చిలో ఈ బేస్‌పై రష్యా చేసిన దాడిలో 35 మంది మృతి చెందారు. బెలారస్ నుంచి ఉత్తర ఉక్రెయిన్‌లోని చెర్నిహైవ్‌పై 20 రాకెట్లతో దాడి చేసింది. సెంట్రల్ ఉక్రెయిన్‌లోని జైటోమిర్ రీజియన్‌పై శనివారం ఉదయం దాదాపు 30 రాకెట్లను ప్రయోగించింది. డాన్‌బాస్ ప్రాంతాన్ని చేజిక్కించుకునేందుకు సీవీరోదొనెట్స్క్, లీసీచాన్స్క్ కీలకమనే ఉద్దేశంతో పుతిన్ సేనలు మొదటి నుంచి వీటిపై దృష్టి సారించాయి. ఇప్పటికే రష్యా దాడుల ధాటికి సీవీరోదొనెట్స్స్ మొత్తం శిథిలాల కుప్పగా మిగిలింది. ఒకప్పుడు 10 లక్షల మంది జనాభా ఉండే ఆ నగరంలో ఇప్పుడు 10,000 మంది కూడా లేరు. అక్కడి అజోట్ రసాయన కర్మాగారంలో 500 మంది పౌరులతో పాటు కొందరు ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్నారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!