అమెరికాకు సమస్య వస్తే ప్రపంచానికి సంక్షోభమే..2008లో జరిగింది ఇదే.. ఇప్పుడు జరుగుతున్నదీ అదే..
అమెరికా ద్రవ్యోల్బణం 40ఏళ్ల గరిష్టానికి పెరిగింది.దాన్ని కంట్రోల్ చేయటానికి తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలను సంక్షోభం ముంగిట నిలుపుతున్నాయి..కరోనా కష్టాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా మాద్యం అన్నీ కలిసి ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం వైపు నడిపిస్తున్నాయా?
ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రణాళికలు వేసినా అది ఆర్తిక పరిస్థితి బాగున్నంత వరకే..జేబు నిండుగా ఉంటే, ఆ డబ్బుకి విలువ ఉంటే లోకమంతా కళకళలాడుతూనే ఉంటుంది.
కానీ, ఇప్పుడు ప్రపంచానికి ఆ విషయంలోనే గడ్డుకాలం వచ్చేసింది.కరెన్సీ విలువలు పడిపోతున్నాయి..
ద్రవ్యోల్బణం పెరుగుతోంది..ఉద్యోగాలు ఊడుతున్నాయి..దేశాలకు దేశాలే అప్పుల్లో కూరుకుని దివాళా తీస్తున్నాయి..
సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడుతోంది.మొత్తంగా ఆర్థికవేత్తలు హెచ్చరించిందే జరుగుతోంది..
వరుసగా ఒక్కో దేశం ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతోంది.మరోసారి ఆర్థిక మాంద్యం ముంగిట ప్రపంచం నిలబడింది.
2008లో వచ్చిన గడ్డుకాలాన్ని ప్రపంచం మర్చిపోలేదు..నాటి ఆర్థిక మాంద్యం ఇప్పటికీ పీడకల లాగే వెంటాడుతోంది.
ఇప్పుడు అదే తరహాలో ప్రపంచ దేశాలను ఆర్థిక మాంద్యం చుట్టుముడుతోందనే ఆందోళన పెరుగుతోంది.
ఒకటీ రెండు కాదు….దాదాపు 69 దేశాలు ఆర్థిక మాంద్యం ముంగిట ఉన్నాయనిఆర్థికవేత్తల హెచ్చరికలున్నాయి కరోనా కష్టాలు ఇంకా ప్రపంచాన్ని వదల్లేదు..కరోనాతో కుప్పకూలిన వ్యవస్థలు తేరుకోనేలేదు..అంతలోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడింది..
యుద్ధప్రభావం అనేక దేశాలపై భారీగా పడింది..అప్పుల మీద అప్పులు చేసి, వడ్డీల మీద వడ్డీలు కడుతూ
చివరికి చేతులెత్తేసే పరిస్థితికి వచ్చాయి..
మన పక్కనే ఉన్న శ్రీలంకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం..తిండి నీళ్ల కోసం జనాలు అల్లాడుతున్నారు..
పెట్రోల్, డీజిల్ కోసం కిలోమీటర్ల దూరం క్యూలో నిలబడుతున్నారు..కరెంటు లేదు.. పిల్లలకు చదువులేదు..పరిపాలన లేదు..చివరికి ప్రధానుల ఇళ్లపై కూడా దాడులకు దిగుతున్న పరిస్థితి ఉంది..
ఒక్క శ్రీలంకలోనే కాదు..ఆఫ్రికాలో 25 దేశాలు, ఆసియా పెసిఫిక్ లో 25 దేశాలది ఇదే పరిస్థితి..
ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలు ఆఫ్రికా దేశాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి.ఆ దేశాల్లో మామూలు రోజుల్లోనే ఏదో ఒక సంక్షోభం ఉంటుంది..అసాధారణ పరిస్థితుల మధ్య బతికే ప్రజానీకం ఇప్పుడు ఆర్తిక సంక్షోభం కాలంలో పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టు కష్టాల్లో పడ్డారు..స్థిరత్వం లేని ప్రభుత్వాలు, సైనిక జోక్యం, అవినీతి.. వీటికి తోడైన కరోనా సంక్షోభం అనేక దేశాలకు కోలుకోలేని దెబ్బతీసింది..దానిపై రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడింది.ఫలితంగా పూటగడవని పరిస్థితికి చేరుకుంటున్నారు.
ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి.దేశాలను తాకట్టు పెడుతున్నాయి.ఉద్యోగాలు ఊడుతున్నాయి.జనం చేతిలో కరెన్సీ రావటం లేదు..వచ్చినా దానికి విలువల లేకుండా పోయింది.ఈ పరిస్థితిలో ప్రపంచ జనాభాలో దాదాపు 200 కోట్లమంది ఉన్నారు..
ఆఫ్రికా, ఆసియా దేశాలే కాదు..అగ్రరాజ్యం అమెరికా కూడా కష్టాల్లోనే ఉంది.అమెరికాలో ద్రవ్యోల్బణం భారీగాపెరుగుతోంది.
గ్యాస్, ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులు, సేవల ధరలు గణనీయంగా పెరిగాయి దీంతో ఇన్ ఫ్లేషన్ 40 ఏళ్ల గరిష్టానికి చేరింది.
మే నెలలో ధరలు 8.6 శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.1981 తర్వాత ఈ స్థాయిలో ధరలు పెరగటం ఇదే తొలిసారి.
దీంతో వడ్డీరేట్ల పెంపు విషయంలో ఫెడరల్ రిజర్వు మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అమెరికాలో పెట్రోల్ డీజిల్ మాత్రమే కాదు.. ఇతర వస్తువుల ధరలతో పాటు, అన్ని రంగాలదీ ఇదే పరిస్థితి..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితం స్పష్టంగా పడింది..
దీంతో ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను మరింత వేగంగా పెంచే సూచనలున్నాయి..అదే జరిగితే రుణాలు భారమై ఆర్థిక మాంద్యానికీ దారితీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆర్థికమాంద్యం దూసుకొస్తోందా?
ఈ ఏడాది చివరికే మాంద్యం వస్తుందా?
2022 ఆఖరుకు ప్రపంచం దివాలా తీస్తుందని కొందరి వాదన..అప్పులిచ్చిన దేశాలది ఓ కష్టం..తీసుకున్న దేశాలది మరీ కష్టం..
అన్నీ కలిసి ప్రపంచమంతా ఆర్థిక కష్టం.అటు ప్రపంచ బ్యాంకు కూడా ఇదే మాట చెప్తోంది.మాంద్యం పొంచి ఉందని హెచ్చరిస్తోంది.ఈ సంవత్సరాంతానికి అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని ..ఆ తర్వాత కొన్ని దేశాలు తీవ్ర మాంద్యంలో చిక్కుకుంటాయనిప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక చెప్తోంది.ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా దేశాలు ఆర్థిక మాంద్యం బారిన పడకుండా తప్పించుకోలేవని ప్రపంచబ్యాంక్ హెచ్చరిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి అంచనాల్ని ప్రపంచ బ్యాంక్ భారీగా కుదించింది.
2021లో అంతర్జాతీయ ఆర్థికాభివృద్ధి రేటు 5.7 శాతం ంటే,ఈ ఏడాది 2.9 శాతానికి పడిపోతోంది.2022 జనవరిలో ప్రకటించిన 4.1 శాతం అంచనాలకంటే ఇది బాగా తక్కువ.వరుస కొవిడ్ వేవ్స్‌తో అంతర్జాతీయంగా సరఫరా అవరోధాలు ఏర్పడటం,
వర్థమాన దేశాల్లో ఆదాయం పడిపోవటం..పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు ఆగిపోవటంతో 2022 ప్రారంభంలోనే వృద్ధి అంచనాల్ని తగ్గించింది.
ఒకవైపు వృద్ధి కనిష్ఠస్థాయికి పడిపోవడం, మరోవైపు ధరలు గరిష్ఠస్థాయికి పెరగడాన్ని స్టాగ్‌ఫ్లేషన్ అంటారు..ఈ పరిస్థితి చాలా కాలం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ చెప్తోంది.ఇది వర్థమాన దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని దారుణంగా అతలాకుతలం చేస్తుందని భావిస్తున్నారు.1970ల్లో అధిక చమురు ధరలతో ద్రవ్యోల్బణం పరుగులు తీసింది.మిడిలీస్ట్ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో మాంద్యం ఏర్పడింది..ఇప్పుడు కూడా అవే పరిస్థితులు కనిపిస్తున్నాయంటోంది ప్రపంచ బ్యాంకు
మరోపక్క ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఇన్ ఫ్లేషన్ వేడి ఇంకా పూర్తి స్థాయికి చేరలేదంటున్నారు.ప్రస్తుత చమురు ధరలతో ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో పడే పరిస్థితి ఉంటుందంటున్నారు..అమెరికా ఆర్థిక వ్యవస్థ తొందర్లోనే మాంద్యంలో పడుతుందని రాజన్ అంటున్నారు.
అమెరికా కంపెనీలు ఇప్పటికే ఉద్యోగుల తొలగింపుకు మొదలు పెట్టాయని గుర్తుచేస్తున్నారు.అయితే ఈ మాంద్యం 2008లో వచ్చిన మాంద్యం అంత తీవ్రంగా ఉండదంటున్నారు రాజన్..
అయితే,అమెరికా ద్రవ్యోల్బణం వివరాలు వెలువడిన నాటి నుంచి భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పడ్డాయి.
ఒకే ఒక్క రోజు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి.
ఓ వైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు.. మరోవైపు దేశీయంగా ద్రవ్యోల్బణ భయాలతో
ఆసియా పసిఫిక్ సూచీలు ఇండెక్స్ లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
వరుసగా మూడోరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలకు నస్టాలను మిగిల్చాయి..
చమురు సెగ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..ప్రపంచ ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్టాగ్‌ఫ్లేషన్ దిశగా పయనిస్తోంది.ప్రపంచ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన నివేదికే ఈ అంశాన్నే చెప్తోంది.
అందుకే ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 4.1 శాతం వరకు ఉంటుందని వేసిన అంచనాలను 2.9 శాతానికి కుదించింది.
గత ఏడాదితో పోలిస్తే ఇది 2.8 శాతం తక్కువ.అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది.భారత్‌లోనూ ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది.ఇవన్నీ పొంచి ఉన్న స్టాగ్‌ఫ్లేషన్‌కు సంకేతాలని ప్రపంచ బ్యాంక్ చెప్తోంది.అనేక దేశాలు ఆర్థిక మాంద్యం నుండి తప్పించుకున్నా,స్టాగ్‌ఫ్లేషన్ నుంచి మాత్రం తప్పించుకోలేవంటోంది
రష్యాఉక్రెయిన్ యుద్ధం పర్యవసానంగా ప్రపంచ సరఫరా వ్యవస్థ అస్తవ్యస్థమైంది.బొగ్గు మొదలుకొని ఎరువుల వరకూ అన్నింటికీ కొరత ఏర్పడింది.కనీసం ఈ ఏడాది చివరికైనా సరఫరా వ్యవస్థ సర్దుకుంటుందన్న ఆశ లేదు.వచ్చే రోజుల్లో ఆహారం, ఇంధనం, కమోడిటీల ధరలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవు.కరోనా ఉగ్రరూపం దాల్చినప్పుడు విధించిన లాక్‌డౌన్‌లతో
కోట్లాదిమంది ఉపాధికోల్పోయారు. కోట్లమందికి ఆదాయాలు పడిపోయాయి..దీంతో డిమాండు పడిపోయి, మార్కెట్ కళావిహీనంగా మారింది.కరోనా ప్రభావం నుండి ప్రపచ దేశాలు తేరుకోకుండానే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వచ్చిపడింది.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య దాదాపు నాలుగు నెలలుగా సాగుతోంది.అమెరికా, నాటో దేశాల కుట్రలు, రష్యా ఎత్తుగల పర్యవసానాలను ఉక్రెనియన్లు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు.పరోక్షంగా భారత్ సహా పదుల సంఖ్యలో దేశాలు కష్టాల్లో పడ్డాయి.
పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు రష్యాకు వరంగా మారాయి.మార్చి రెండున ముడి చమురు ధర 60 డాలర్లవరకు ఉంటే తరువాత 110 డాలర్లు దాటింది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ద్రవ్యోల్బణం పెరుగుదలతో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు తెరతీసింది.
ఈ రేట్లు మరింత పెరిగితే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికే పలువురు ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.
రేట్లు పెరుగుతూపోతే ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోయి, మాంద్యంలోకి జారిపోవటం ఖాయం.
2008లో ఆర్థిక సంక్షోభం కారణంగా జరిగిన మార్కెట్ పతనాల్ని ప్రస్తుత మాంద్యం హెచ్చరికలు గుర్తుచేస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో కొద్ది నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుందనే అంచనాలు ఆందోళనకరంగా మారాయి
ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందని,ఆ తర్వాత కొన్ని దేశాలు తీవ్ర మాంద్యంలో చిక్కుకుంటాయనే అంచనాలున్నాయి.అనేక దేశాల్లో ఇప్పటికే ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకుంది.
ఈ కారణంగా అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి.కీలక వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతున్నాయి.
భారత రిజర్వు బ్యాంక్ రెండు నెలల కాలంలో రెపో రేటును ఏకంగా 90 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
ఇదే సమయంలో యూఎస్ లో ద్రవ్యోల్బణం ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడుతోంది.దీనిని అదుపుచేసే క్రమంలో అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుకు సిద్ధమవుతోంది.ఈ విషయంలో అక్కడి ఆర్థిక వేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అమాంతం రేట్లు పెంచుతూ ఉండే ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతుందని వారు అంటున్నారు.
దీని వల్ల డిమాండ్ పడిపోయి ఉత్పత్తి చేసే సంస్థలపై కూడా భారీగా ప్రభావం పడుతుందని అంటున్నారు.ఈ పరిణామాలు 2008నాటి ఆర్థిక మాంద్యాన్ని గుర్తుచేస్తున్నాయి.
అమెరికాలో మాంద్యం వస్తే దాని ప్రభావం అనేక దేశాలపై ఉంటుంది.ఆ దేశం నుండి పెట్టుబడులు తగ్గుతాయి
నిరుద్యోగం పెరుగుతుంది.ప్రపంచమంతా అనేక రంగాలు ప్రభావితమౌతాయి.అది మనదేశంపై కూడా ప్రభావం చూపుతుంది.
గతంలో మాంద్యం వచ్చినపుడు మనదేశం సమర్థంగా బయటపడినా.ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవంటున్నారు ఆర్థిక వేత్తలు
ఎందుకంటే మనదేశంలో ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలున్నాయి.ఇటు మన దేశం ఐదు లక్షల ట్రిలియన్ల డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంది.కానీ వరుసగా జరుగుతున్న పరిణామాలన్నీ రివర్స్ లోనే ఉన్నాయి.కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందన్న సంకేతాలు కనిపించినా..అది నిజం కాదని తేలిపోయింది. మొదట నిరుద్యోగం తీవ్రంగా పెరిగింది.
తర్వాత ద్రవ్యోల్బణం కోరలు చాచింది.ఇప్పుడది 7శాతం పైగా ఉంది..ఇప్పుడు రూపాయి జీవనకాల కనిష్ఠానికి చేరింది.
ఈ రోజుకి డాలర్ కి రూపాయి విలువ దాదాపు రూ 78గా ఉంది.దీనికి తోడు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కూడా అడుగంటుతున్నాయి.
ఇప్పటికే మన చుట్టుపక్కల దేశాలైనా పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్, నేపాల్ ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి.
మన ఆర్థిక వ్యవస్థ కూడా పతనం దిశగా వేగంగా పరుగెడుతున్న పరిస్థితుల్లో..
భవిష్యత్తులో ఏమౌతుందోననే భయాలు పెరిగిపోతున్నాయి.
రూపాయి విలువ లైఫ్ టైమ్ కనిష్ఠానికి పతనం కావడం చిన్న విషయం కాదు.రూపాయి పతనం ప్రభావం పలు రంగాలపై తీవ్రంగా ఉంటుంది.ముఖ్యంగా సామాన్యుడి జీవన చక్రానికి కీలకమైన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు మరింతగా పెరగడం ఖాయం.
పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది..నిజానికి కోవిడ్ తర్వాత మన ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో కోలుకోలేదు.కోవిడ్ కాలంలో కుదేలైన పరిశ్రమలు, వ్యాపారాలు ఇంకా గాడిన పడలేదు.ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాది మంది మళ్లీ పనిలో కుదురుకోలేదు.ఈలోగానే ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతుండటంతో.. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
దేశంలో ఇప్పటికీ లేబర్ ఫోర్స్ లో 40 శాతం మంది మాత్రమే యాక్టివ్ అయ్యారు.దేశంలో ధనికులు, పేదల మధ్య అంతరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.ఇవన్నీ దేశం మాంద్యంలోకి జారుతోందనే హెచ్చరికలిస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో ఉన్నపుడు ప్రజలకు ఖర్చు చేసే శక్తి ఉండదు..వినిమయం పెరగాలంటే ఆదాయం కూడా పెరగాలి.
మాంద్యంలో ఆదాయం పెరిగే ఛాన్సుండదు.దేశంలో వినిమయం పెరిగే అవకాశం లేనపుడు ఉత్పత్తి పెంచటానికి పెట్టుబడులు రావు..అలాంటి పరిస్థితుల్లో దేశం ఆర్థిక మాంద్యం నుండి బయటకు రావటం అంత తేలిక కాదు..
ఇప్పటికే మన పక్కనే ఉన్న శ్రీలంక లాంటి దేశాలను చూస్తున్నాం.అప్పులో ఊబిలో కూరుకుని, ఆర్థిక వృద్ధి లేకుండా, జీనవ ప్రమాణాలు పడిపోయి.నిత్యావసరాలు కొనలేని ప్రజలతో అష్టకష్టాలు పడుతోంది. మనదేశానికి అంతటి దారుణ పరిస్థితి రాకపోవచ్చు కానీ,ఆర్థిక వృద్ధి కోసం మనం వేసుకున్న అంచనాలు తప్పుతాయని మాత్రం ఇప్పటికే స్పష్టమైన అంశం.
మాంద్యం అంటే మందగమనం.మాంద్యం ఏర్పడితే ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోతాయి.మాంద్యం అనేది కొన్ని నెలల నుండి ఎన్నో సంవత్సరాలు కూడా ఉండవచ్చు.నిజమైన స్థూల జాతీయోత్పత్తి, ఆదాయం, ఉపాధి, తయారీ మరియు రిటైల్ అమ్మకాలు పడిపోతాయి.
ధరలు పెరగడం వలన ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం లేకపోవడంతో వినియోగదారులు తమ ఖర్చులు తగ్గించుకోవడం మొదలుపెడతారు. వినియోగదారులు ఖర్చు తగ్గించుకోవడంతో ఉత్పత్తుల డిమాండ్ తగ్గుతుంది. ఇది తయారీదారుల ఉత్పత్తి తగ్గించటానికి దారితీస్తుంది. ఉత్పత్తి స్థాయిలు తక్కువగా ఉండటంతో సంస్థలు ఉద్యోగులను తగ్గించుకుంటాయి. దీనివల్ల నిరుద్యోగం పెరుగుతుంది. ఇదంతా ఆర్ధిక వ్యవస్థ అంతా ఒక సైకిల్ చెయిన్‌లాంటిది. ఇది ఒకచోట మొదలయితే.. ముందుకు వెళ్లడం కష్టం. మాంద్యం పరిస్థితుల్లో.. కొత్త పెట్టుబడులు రావడం కష్టమవుతుంది. ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు కొన్ని కార్పోరేట్లు ప్రయత్నిస్తాయి. తద్వారా మార్కెట్లో నిధుల ఫ్లో తగ్గిపోతుంది. చిన్న సంస్థలు నిలబడలేక దివాలా తీస్తాయి.
2006-07 లో అమెరికాలో మొదలైన మాంద్యం ప్రపంచమంతా పాకింది.దాదాపు రెండు సంవత్సరాల పాటు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసింది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది భారీ ప్రభావం చూపింది.ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయి.2008 మాంద్యం సమయంలో తొలుత బ్యాంకింగ్ రంగాన్ని ఆవహించిన సంక్షోభం..నిదానంగా వాస్తవ ఆర్థిక వ్యవస్థకు పాకింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.కరోనా సంక్షోభం తర్వాత సప్లయ్ చెయిన్ దెబ్బతినడం..చాలా దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోలేకపోవడంతో పాటు ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా ప్రభావం చూపుతున్నాయి.అప్పుడు అమెరికాలో సంక్షోభం మొదలైతే.. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి పరిస్థితే ఉంది.ఏకంగా 69 దేశాలు ఆర్థిక మాంద్యం ముంగిట ఉన్నాయనే వార్త అందరినీ కలవరపెడుతోంది.
శ్రీలంక నుంచి ఐరోపా దేశాల వరకు.. పలుదేశాల్లో ఇదే పరిస్థితి ఉంది.
డాలర్లు అడుగంటడం, లెక్కకు మిక్కలి అప్పులు, తీవ్ర నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం..లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల కష్టాలకు కారణం.దాదాపు ఇవే పరిస్థితులు.. మన పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్‌లలో ఉన్నాయి.చైనా ఇచ్చిన అప్పుల ఊబిలో చిక్కుకుని విలవిలలాడుతున్న లంక.. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడో ముగుస్తుందో.. ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.దీంతో చమురు ధరలు, వంట నూనెల ధరలు రాకెట్ స్పీడుతో పెరిగాయి.
2008 రెసిషన్ సమయంలో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పతనానికి గురికాకుండా ఉండటానికి.భారీ బెయిల్-అవుట్లు, ఉపశమన చర్యలు తీసుకున్నారు.ఉద్దీపన ప్యాకేజీలతో.. మాంద్యం పరిస్థితుల నుంచి బయటపడ్
గత డిసెంబర్ నాటికే కేంద్రం అప్పులు రూ. 128.4 లక్షల కోట్లు. దీనికి రాష్ట్రాల అప్పులు అదనం.
ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన అప్పుల చిట్టా లెక్కేస్తే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడింది.
2021 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం దేశ స్థూల జాతీయోత్పత్తి అంటే జీడీపీలో అప్పులు 60.5 శాతం ఉన్నాయి.
గత డిసెంబర్ నాటికే దాదాపు 130 లక్షల కోట్ల అప్పు కేంద్రం చేస్తే,
ఇప్పుడది రూ.135.87 లక్షల కోట్లు దాటి రూ.150 లక్షల కోట్ల దిశగా పెరుగుతోందని అంచనాలున్నాయి.
ఈ ఏడాది మరో 17 లక్షల కోట్ల అప్పు తీసుకోవడానికి మోదీ సర్కారు ప్లాన్ చేసింది.
కేంద్రం అప్పులు ఇదే లెక్కన పెరిగితే 2023 నాటికి దేశ మొత్తం బాకీ రూ. 153లక్షల కోట్లకు చేరనుందని అంచనాలున్నాయి.
అంటే ఓ పక్కన ఆర్థిక మాంద్యం, మరోపక్క పెరుగుతున్న అప్పులు, వడ్డీలు కలిసి మనదేశాన్ని కష్టాల ముంగిట నిలపనున్నాయనే ఆందోళన ఆర్థికవేత్తల్లో ఉంది.