Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు ఐఫోన్లు వాడొద్దనే ఆదేశాలు అధికారులకు వెళ్లాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అమెరికా తయారీ ఐఫోన్ కావడంతో పాశ్చాత్య దేశాలు నిఘా పెంచే అవకాశం ఉండటంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవి కొనొద్దని, ఉన్నవాటిని పక్కన పారేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’.. పక్కా పాన్ ఇండియా లెవల్
ఐఫోన్ పని ముగిసిపోయింది, దాన్ని పడేయండి లేదా మీ పిల్లలకు ఇవ్వండి మార్చి చివరి నాటికే ప్రతీ ఒక్కరు ఈ పనిని పూర్తి చేయాలని రష్యా అధ్యక్షభవనం పాలనాధికారి సెర్గీ కియోంకో అక్కడి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఐ ఫోన్ స్థానంలో కొత్త ఓఎస్ ఉన్న ఫోన్లు అందించేందుకు రష్యా సిద్ధం అయింది. అయితే ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ధ్రువీకరించలేదు. కాగా, అధికార కార్యకలాపాలకు స్మార్ట్ ఫోన్లను వాడొద్దని నిర్ణయించారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్మార్ట్ ఫోన్లను వాడరని, వాటి వల్ల గోప్యంగా ఉండే సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉందని, అత్యంత అరుదుగా పుతిన్ ఇంటర్నెట్ వాడుతారిన వెల్లడించారు.