Dmitry Medvedev: వ్లాదిమిర్ పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) వారెంట్ జారీ చేసిన తర్వాత విదేశాల్లో వ్లాదిమిర్ పుతిన్‌ను అరెస్టు చేసే ప్రయత్నాలను మాస్కో “యుద్ధ ప్రకటన”గా చూస్తుందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ హెచ్చరించారు. 2008-2012 మధ్య అధ్యక్షుడిగా పనిచేసిన మెద్వెదేవ్, పుతిన్ ఉక్రెయిన్‌కు సైన్యాన్ని పంపినప్పటి నుంచి, పదేపదే అణు బెదిరింపులను జారీ చేసినప్పటి నుంచి చాలా బెదిరింపు ప్రసంగాలు చేశారు. పుతిన్‌ను అరెస్టు చేస్తే రష్యా ఆయుధాలు ఒక దేశాన్ని తాకుతాయని ఆయన హెచ్చరించడం గమనార్హం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) గతవారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఉక్రెయిన్ యుద్ధ నేరాలపై ఆయనకు ఈ వారెంట్ జారీ అయ్యింది. ఉక్రెయిన్‌లోని పిల్లల్ని చట్టవ్యతిరేకంగా తరలించినట్లు పుతిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హేగ్‌లోని ఐసీసీ.. రష్యాకు చెందిన చిల్డ్రన్ రైట్స్ కమిషనర్ మారియా లోవా బెలోవాకు కూడా అరెస్టు వారెంట్ జారీ చేసింది.
Read Also: Viral News : సింహాన్నే పరిగెత్తించిన వీధి కుక్కలు.. తోక ముడిచిన మృగరాజు
పుతిన్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అనంతరం మెద్వెదేవ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పుతిన్ అరెస్ట్ అనేది ఎప్పటికీ జరగదని.. ఒకవేళ అది జరుగుతుందని ఊహించుకుంటే.. రష్యన్ ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన చేసినట్లేనని హెచ్చరించారు. ఒక వేళ అరెస్ట్ జరిగితే రష్యా ఆయుధాలు, రాకెట్లు ఆ దేశంలో ఎగురుతాయని చెప్పాడు. ఐసీసీ నిర్ణయం పశ్చిమ దేశాలతో భయంకరమైన సంబంధాలను మరింత దిగజార్చుతుందని రష్యా భద్రతా మండలి డిప్యూటీ ఛైర్మన్ మెద్వెదేవ్ అన్నారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడనుందా..? 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో భారీ కుదుపు
ఐసీసీ జారీ చేసిన ఆ ఆదేశాలను రష్యాఅధికారులు కొట్టిపారేశారు. ఐసీసీలో రష్యాకు భాగస్వామ్యం లేదని అన్నారు. కానీ ఐసీసీ ఇచ్చిన తీర్పును ఉక్రెయిన్ స్వాగతించింది. ఇది చరిత్రాత్మకమైన నిర్ణయమని జెలెన్‌స్కీ అన్నారు. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు చెందిన సుమారు 16 వేల మంది చిన్నారుల్ని అక్రమ రీతిలో రష్యాకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఐసీసీ ఆదేశాల ప్రకారం.. ఒకవేళ పుతిన్ ఏదైనా ఐసీసీ సభ్య దేశంలో అడుగుపెడితే, అప్పుడు అతన్ని అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయని ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో సుమారు 120 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే వారెంట్‌ను అమలు చేసే పరిస్థితి మాత్రం అంతర్జాతీయ దేశాల సహకారంపై ఆధారపడి ఉంటుందని ఐసీసీ ప్రెసిడెంట్ పియోటర్ హాఫ్‌మన్‌స్కీ తెలిపారు.