Nikki Haley: వచ్చే అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ల తరుపున భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ బరిలో నిలవనున్నారు. చెప్పకనే చెబుతూ.. ఆమె అప్పుడే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించినట్లయింది. ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె చైనాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్ట్ చైనా చరిత్ర బూడిద కుప్పగా ముగుస్తుందంటూ విమర్శించారు. పూర్వపు సోవియట్ యూనియన్ లాగే చైనా పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.
India-Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం భేటీ అయ్యారు. మాస్కోల ఈ ఇదద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ విషయానని రష్యాలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. "ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ సమస్యలపై విస్తృత చర్చ జరిగినట్లు వెల్లడించింది.
రష్యా ఆధీనంలో ఉన్న లుగాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్లోని ఓ ఆస్పత్రిపై ఉక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
Roman City : ఈజిప్టులోని పురావస్తు శాస్త్రవేత్తలు 1,800 సంవత్సరాల పురాతన రోమన్ నగరాన్ని కనుగొన్నారు. ఈజిప్టులోని లక్సోర్ నగరం ఈ ఆవిష్కరణకు వేదికైంది. ఈ నగరం రెండు లేదా మూడవ శతాబ్దానికి చెందినది ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, జర్మనీలు ప్రకటించిన నేపథ్యంలో రష్యా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేసిన క్షిపణి దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు.
Fake Call : విమానాలు, రైళ్లకు ఫేక్ బెదిరింపు కాల్స్ రావడం మళ్లీ ఎక్కువైపోయింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కృష్ణా ఎక్స్ ప్రెస్ కు బెదిరింపు కాల్ వచ్చింది. రైల్లోని వ్యక్తే బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేయడంతో.. అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టి బాంబులేదని తేల్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయి 11 నెలలు గడుస్తోంది. వచ్చే నెలతో ఏడాది పూర్తవుతుంది. అయినా కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. తప్పితే తగ్గడం లేదు. గతేడాది ఫిబ్రవరిలో రష్యా, ఉక్రెయిన్ పై సైనిక చర్యను ప్రారంభించింది. అయితే సైనికపరంగా శక్తివంతమైన రష్యా ముందు ఉక్రెయిన్ వారం రోజుల్లో లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ.. పాశ్చాత్య దేశాలు, అమెరికా, నాటో కూటమి ఇచ్చే ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్, రష్యాను…
అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే రష్యాకు వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడటానికి జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది.