బుడమేరుకు గండ్లు పడ్డాయంటూ వచ్చిన పుకార్లపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు. నగరంలో పలు ప్రాంతాల్లోకి మళ్ళీ బుడమేరు వరద వస్తుందనేది కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు.
తన తండ్రి కోసం ఎన్నికల ప్రచారంలో చిరుత హీరోయిన్ నేహా శర్మ దూసుకుపోతున్నారు. ఓపెన్ టాప్ వాహనంలో తన తండ్రితో కలిసి ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
Hyderabad Petrol Bunks: పెట్రోల్ బంకులు మూతపడతాయన్న వదంతులు మళ్లీ వ్యాపించడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ కోసం ప్రజలు బారులు తీరారు. నగరంలోని పాతబస్తీలో ఒక్కసారిగా..
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌కు అత్యంత సన్నిహితుడు, చైనా విదేశాంగమంత్రి క్విన్ గాంగ్ గత నెలరోజులుగా ఆచూకీ లేకుండా పోవడం చైనాలో కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి కనిపించకుండా పోవడం సాధారణ విషయం కాదు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రైడెంట్ హోటల్ బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
జీన్స్, దొంగ దొంగ, జోడీ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరో ప్రశాంత్. నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో అటు కోలీవుడ్ లోను, ఇటు తెలుగులోని తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రశాంత్, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో అంధాధూన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ హీరో గురించిన ఒక వార్త…
ఇండియన్ ఆర్మీకి నటుడు సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దానిపై ఆయన స్పందించారు. సుమన్ మాట్లాడుతూ “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాటిని నమ్మవద్దు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే… వ్యక్తిగతంగా నేనే అందరికీ తెలియజేస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతాను” అని తెలిపారు.